24.7 C
Hyderabad
October 26, 2021 04: 09 AM
Slider ప్రత్యేకం

మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు పంట సాగుకు మొగ్గు చూపాలి

#kollapur

రైతులు ఒకే పద్దతిలో కాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా పంట సాగుకు మొగ్గు చూపాలని  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తాము పండించిన పంటకు మార్కెట్ లో డిమాండుకు అనుగుణంగా పంట మార్పిడి చేస్తూ ఉండాలని మంత్రి రైతులకు పిలుపునిచ్చారు.

మంగళవారం కొల్లాపూర్ నియోజకవర్గంలో ని పెద్దకొత్తపల్లి మండల క్లస్టర్లు కల్వకోల్, గంట్రావు పల్లి, సాతాపూర్, చిన్నకొత్తపల్లి, పెద్ద కార్పముల, పెద్దకొత్తపల్లి, చంద్రకల్,వెన్నచెర్ల లో నిర్మించిన రైతు వేదికలను కొల్లాపూర్ శాసన సభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి,  పార్లమెంట్ సభ్యులు పి. రాములు, జడ్పి చైర్మన్ పెద్దపల్లి పద్మావతి, జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ తో కలిసి ప్రారంభోత్సవం చేశారు.

ఈ సందర్భంగా రైతులకు, ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ వానాకాలం పంటను యధావిధిగా కొంటామని యాసంగి నుండి వరికి బదులు ప్రత్యామ్నాయ పంట వేసుకోవాలని  రైతులకు సూచించారు. వానకాలంలో వేసిన పంటను కొనడానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సుముఖత చూపించింది కాబట్టి మొత్తం ధాన్యాన్ని కొని మిల్లులకు ఇవ్వడం జరుగుతుంది కానీ యాసంగి లో బియ్యం నూకలు ఎక్కువ అయ్యే ప్రమాదం ఉందని యఫ్.సి.ఐ ఉప్పుడు బియ్యం కొనడానికి సిద్ధంగా లేనందున రైతులు ఇతర ప్రత్యామ్నాయ పంట సాగు వైపు ఆలోచించాలన్నారు. 

ఎండాకాలం రాకముందే పంట కోతకు వచ్చేలా చూసుకోండి

యసంగి  వరి ధాన్యం మాత్రమే వేయాలనుకునే రైతులు ఒక నెల పంటను ముందుకు జరుపుకుని ఫిబ్రవరి, మార్చి వరకు పంట కోతకు వచ్చే విధంగ సన్నద్ధం కావాలన్నారు.  అప్పుడు ఎండలు ముదరకముందే పంట కోతకు వస్తే నూకలు తగ్గీ ఉప్పుడు బియ్యం చేయాల్సిన పనిలేకుండా రా రైస్ చేసుకోవచ్చు అన్నారు.  లేదంటే నూనె గింజ పంటలకు మంచి డిమాండ్ ఉందని, నువ్వులు, ఆవాలు, కుసుమలు, వేరు సేనగా, పప్పు సేనగా వంటి పంటలు వేసుకోవాలని రైతులను సూచించారు. 

ఆయిల్ పామ్ పంట కు సైతం మంచి డిమాండ్ ఉందని అయితే ఈ సంవత్సరం కేవలం 30 వేల ఆయిల్ పామ్ మొక్కలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, రైతులు ఇప్పటి నుండే రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వచ్చే సంవత్సరం నుండి మొక్కలు అందించడం, సబ్సిడీ కల్పించడం జరుగుతుందన్నారు.

అంతకుముందు   నాయినోని పల్లి మైసమ్మ దేవతా నూతన దేవస్థానాన్ని పరిశీలించి అమ్మవారి పూజల్లో పాల్గొన్నారు. అనంతరం మైసమ్మ దేవత దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ రూర్బన్ పథకము కింద రూ. 76 లక్షల వ్యయం తో నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంపెక్స్ ను, రూ. 18 లక్షల వ్యయంతో నిర్మించిన దేవాదాయ అతిథి గృహాన్ని మంత్రి ప్రారంభోత్సవం చేశారు.  

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు పి. రాములు మాట్లాడుతూ కల్వకుర్తి నుండి కొల్లాపూర్ మీదుగా  నంద్యాల కు జాతీయ రహదారి 167 కు డీపీఆర్ తయారు చేయడం జరుగుతుందని, ఈ జాతీయ మార్గం పూర్తి అయితే అత్యధికంగా లబ్ది పొందేది కొల్లాపూర్ నియోజకవర్గమేనని తెలియజేసారు. 

రూ.12 వందల కోట్లు ఇప్పటికే మంజూరు అయ్యాయని అందులో 600 కోట్లు జాతీయ రహదారికి అయితే మిగిలిన 600 కోట్లు సోమశిల వంతెనకు కేటాయించడం జరిగిందన్నారు.  వంతెన పూర్తి అయితే ఒక పర్యాటక కేంద్రంగా, పారిశ్రామిక పరంగా కొల్లాపూర్ ఏంతో అభివృద్ధి సాధిస్తుందని తెలియజేసారు.  ఈ జాతీయ రహదారి మంజూరు కావడానికి తాను కేంద్ర మంత్రితో మూడు సార్లు ప్రతిపాదనలు పంపించి మంజూరు తీసుకోవడం జరిగిందని తెలియజేసారు.

ఆర్.డి.ఓ హనుమ నాయక్, తహసీల్దార్ శ్రీనివాస చారి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నాగరాజు, ఎంపిపి సూర్యప్రతాప్ గౌడ్, సింగిల్ విండో డైరెక్టర్ రాజేందర్, జడ్పిటిసిలు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు రైతులు మంత్రి వెంట పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్

Related posts

నిజమైన పేదలకే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలి

Satyam NEWS

హెల్ప్డ్ బట్:కూలిన కెనడా విమానం ముగ్గురు మృతి

Satyam NEWS

కార్మికుల పట్ల బిజెపి అనుసరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా సమ్మె

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!