37.2 C
Hyderabad
May 2, 2024 11: 17 AM
Slider కవి ప్రపంచం

మనో సంకెళ్ళు

#pvs

ప్రకృతి స్వరూపిణి అయిన

ఓ స్త్రీ రత్నమా!

ఏమై పోతున్నది నీ మనోధైర్యం?

అనుగ్రహిస్తే , చంద్రకాంత మణివలె

చల్లని అనురాగ కిరణాలను

ప్రసరింపచేయ గలవు

ఆగ్రహిస్తే… అపర కాళివై

ప్రళయాన్ని సృష్టించి

దుష్ట‌సంహారం చేయగలవు కదా!

మరెందుకు తాళిని సంకెలలా భావిస్తున్నావు?

నీ తాళి నుండి వెలువడే కిరణకాంతులు

నిను బందీని చేయాలనుకునే వాడిని

అంధుడిని చేయగలవు

నీ పారాణి పాదాలు వాడి ఎదపై

శివ తాండవం చేయాలి

నీ పాదాల అందియల చిరు సవ్వడి

నిను అణగ దొక్కాలి అనుకునే వారికి

మృత్యు ఘంటికలై భయవిహ్వలుని చేయాలి

నీ నుదుటి కుంకుమ

భగభగ మండే సూర్యుడిలా

కుటిలత్వంతో నీదరి చేరిన వారిని

క్షణంలో భస్మం చేయకలదు కదా!

ఇన్నేల…

సువాసినీ చిహ్నాలే పంచాయుధాలై

దుష్టసంహారం చేస్తాయి అని తెలియదా!

నీ మానసిక దౌర్బల్యమే నీకు సంకెళ్ళు.

లే, మేలుకో, బేలతనాన్ని వీడు భద్రకాళీవై ముందుకు నడు

పీ.వి.యస్. కృష్ణ కుమారి, తుర్కయాంజాల్

Related posts

చైతన్య దీపావళి

Satyam NEWS

అమర్ నాథ్ యాత్రలో పాక్ కుట్ర… భగ్నం

Satyam NEWS

కాలభైరవుడి ఆలయంలో క్షుద్రపూజల కలకలం

Satyam NEWS

Leave a Comment