28.7 C
Hyderabad
April 27, 2024 03: 54 AM
Slider ఖమ్మం

ఈ నెల 6నుండి 13వరకు గొర్రెలకు ఉచిత నట్టల నివారణ కార్యక్రమం

#khammam

తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 6వ తారీఖు నుండి 13వ తారీకు వరకు  గొర్రెలకు ఉచిత నట్టల నివారణ కార్యక్రమం చేపడుతుందని,  ప్రతీ గొర్రెకు నట్టల మందు త్రాగించాలని పశు వైద్యుల సలహా మేరకు నట్టల నివారణ కార్యక్రమం ను గొర్రెల పెంపకం దారులు విజయవంతం చేయగలరని ఉమ్మడి ఖమ్మం జిల్లా గొర్రెల పెంపకందారుల  సహకార యూనియన్ అధ్యక్షులు, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పిలుపునిచ్చారు.

గురువారం కామేపల్లి మండలం పండితాపురం లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గొర్రెలకు సీజనల్ గా తరచుగా వచ్చే వ్యాధులలో భాగంగా వర్షాకాలంలో అడవులకు మేతకు వెళ్లి నీరు నిలచివున్న ప్రాంతాలలోని గడ్డిని మేయడంవలన ,మురుగునీరు త్రాగడం వలన వాటిలో ఉండే సూక్ష్మజీవులు నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశించి జీర్ణాశయంలో రూపాంతరం చెంది జీర్ణ్యవ్యవస్థను దెబ్బతీసి పొట్టబాగాన్ని నాశనం చేయడం వలన జీవాలు మేత తీసుకోలేి వని,క్రమేపీ చనిపోయే అవకాశం ఉన్నదని, నట్టలనివారణ మందు. త్రాగించి జీవాలను కాపాడుకోవాలని సూచించారు.

జీవాల సత్వర వైద్యం కొరకు 1962కు ఫోన్ చేస్తే అంబులెన్స్ వస్తుందని, అవకాశం ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.గొర్రెల పథకానికి మొదటి విడతలో డీడీ లు తీసివున్న లబ్దిదారులకు 4సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న 2వ విడత లబ్దిదారులకు వెంటనే గొర్రెలు పంపిణీ చేయాలని   ఎన్ ఆర్ ఈ జి ఎస్ ద్వారా గొర్రెలకు షెడ్లు మంజూరు చేయాలని, ఢీ వార్మింగ్ తర్వాత జీవాలు బలహీన పడకుండ బలం టానిక్ ను ప్రభుత్వం అందించాలని  ప్రమాదవశాత్తు మరణించిన గొర్రెల కాపరి కి 6లక్షల రూపాయలు మంజూరు చేయాలని పశువుల కు మాదిరిగా గొర్రెలకు కూడా ఇన్సూరెన్స్ చేయించాలని, మల్లిబాబు యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమము లో మేకల మల్లిఖార్జునరావు,కేతబాయిన. రాంబాబు, చింతల పెద్ద వెంకయ్య, అరిపిన్ని అశోక్ ఎం లక్ష్మినారాయణ, బద్దల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

4న తెలంగాణా కాంగ్రేస్ నేతలతో రాహుల్ గాంధీ భేటీ

Sub Editor 2

వైసీపీ ప్రభుత్వం పై ఓర్వలేక చంద్రబాబు కుట్ర

Satyam NEWS

ఇంజుర్డ్:రైలుఫుట్ బోర్డులో ఇరుక్కున్న ప్రయాణికుడు

Satyam NEWS

Leave a Comment