38.2 C
Hyderabad
May 1, 2024 19: 20 PM
Slider ముఖ్యంశాలు

రేపు కామారెడ్డికి సీఎం కేసీఆర్ రాక

#CM KCR

ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న కేసీఆర్

కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారని చేసిన ప్రకటన నుంచి సీఎం ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. రేపు ఆర్డీఓ కార్యాలయంలో కామారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ అనంతరం నేరుగా బహిరంగ సభ నిర్వహించే డిగ్రీ కళాశాల మైదానానికి వెళ్లనున్నారు. గత వారం రోజులుగా సీఎం పాల్గొనే బహిరంగ సభ ఏర్పాట్లను బీఆర్ఎస్ నేతలు సమీక్షిస్తున్నారు. కళాశాల గ్రౌండులో ఉన్న పిచ్చిమొక్కలన్ని క్లీన్ చేశారు. మైదానాన్ని అందంగా ముస్తాబు చేశారు.

సీఎం స్పీచ్ పై ఉత్కంఠ

కామారెడ్డి నుంచే సీఎం కేసీఆర్ పోటీకి కారణాలేంటి. గజ్వేల్ వదిలి ఇక్కడికి ఎందుకు వస్తున్నారు లాంటి అనేక ప్రశ్నలు ప్రజల మదిని తొలిచివేస్తున్నాయి  ఇప్పటికే సీఎం కేసీఆర్ కామారెడ్డికి రావడానికి గల కారణాలను మంత్రి కేటీఆర్ స్పష్టంగా తెలియజేసారు. అయినా మరోసారి కేసీఆర్ నోటే వింటే అసలు విషయం తెలుస్తుందని ప్రజలు భావిస్తున్నారు. కామారెడ్డి వేదికగా సీఎం కేసీఆర్ ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వనున్నారనే చర్చ సాగుతోంది. సీఎం కేసీఆర్ ఒక్కసారి కామారెడ్డి వచ్చి వెళ్తే ఇక్కడి సమీకరణాలు పూర్తిగా మారిపోనున్నాయన్న టాక్ వినిపిస్తోంది.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

కాంగ్రెస్ నాయకుడు హరీశ్ రావత్ కు అస్వస్థత

Satyam NEWS

అంబర్పేట్ లో కారుదే జోరు: మిగతావారు బేజారు

Satyam NEWS

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని గాంధీ విగ్రహం వద్ద నిరసన

Satyam NEWS

Leave a Comment