38.2 C
Hyderabad
April 29, 2024 20: 21 PM
Slider ప్రత్యేకం

కొంతమంది పోలీసులు మూల్యం చెల్లించుకోక తప్పదు

#lokesh

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హెచ్చరిక

తప్పుడు కేసులు బనాయించడంలో కొంతమంది పోలీసులు గిన్నిస్‌ బుక్‌లో స్థానం కోసం పోటీ పడుతున్నట్లుగా కనిపిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం రొంపిచర్లకు చెందిన తెలుగు యువత ప్రధాన కార్యదర్శి గంగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డిని సోషల్‌ మీడియాలో పోస్టుల కేసు విచారణకంటూ తీసుకెళ్లి అక్రమ మద్యం కేసులో ఇరికించారని ఆరోపించారు. గత నాలుగున్నరేళ్లుగా టీడీపీ కార్యకర్తలు, నాయకులపై రాష్ట్రవ్యాప్తంగా 60వేల తప్పుడు కేసులు బనాయించారని లోకేశ్‌ మండిపడ్డారు. సైకో సీఎం కళ్లలో ఆనందం కోసం న్యాయదేవత కళ్లకు గంతలుకట్టి టీడీపీ కేడర్‌ను ఇబ్బందుల పాల్జేస్తున్న కొంతమంది పోలీసులు త్వరలో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని లోకేశ్‌ హామీ ఇచ్చారు.

Related posts

నలుగురు చేతిలో బందీ అయిన కామారెడ్డి మునిసిపాలిటీ

Satyam NEWS

రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ఆదుకోవడం లేదు : సోము వీర్రాజు

Satyam NEWS

‘జిన్నా’ ఫస్ట్ లుక్ లో సన్నీ లియోన్ పోస్ట‌ర్

Satyam NEWS

Leave a Comment