38.2 C
Hyderabad
May 3, 2024 19: 32 PM
Slider నిజామాబాద్

రైతుల జోలికొస్తే కేసీఆర్ ను బొంద పెడతాం

#enuguravindarreddy

రైతుల నోట్లో మట్టి కొట్టాలని చూసినా, రైతుల జోలికొచ్చినా కేసీఆర్ ను బొంద పెడతామని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు ఏనుగు రవీందర్ రెడ్డి హెచ్చరించారు. నలుగురి స్వలాభం కోసం 4 వేల మంది రైతులను రోడ్డున పడేస్తారా అని ప్రశ్నించారు. ఆదివారం సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ఇండస్ట్రియల్ జోన్ లో భూములు కోల్పోతున్న రైతులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా భూములు కోల్పోతున్న రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. రైతులంటే కేసీఆర్ కు చులకనగా ఉందన్నారు. రైతులు తలుచుకుంటే కేసీఆర్ ను బొంద పెడతారని, దానికోసం రైతులు రోడ్డుపైకి వచ్చే పరిస్థితి తీసుకురావద్దని హెచ్చరించారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయకపోతే రాష్ట్ర, దేశ స్థాయి బీజేపీ నాయకులు వచ్చి కామారెడ్డి గడ్డ మీద మాస్టర్ ప్లాన్ ఎత్తేసేవరకు పోరాటం చేస్తారని చెప్పారు. రైతులకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

కవితకు రెండుసార్లు ఎమ్మెల్సీ ఎందుకిచ్చావ్ కేసీఆర్

ఉద్యమాలు చేసి జైలుకు వెళ్లి వచ్చిన.. నాతో పాటు నీ బిడ్డ కవిత కూడా ఎన్నికల్లో ఒడిపోయింది.. నాకు బి ఫార్మ్ ఇవ్వకుండా నీ బిడ్డకు మాత్రం రెండుసార్లు ఎమ్మెల్సి ఎందుకిచ్చావ్ కేసీఆర్ అని ప్రశ్నించారు ఏనుగు రవీందర్ రెడ్డి. ఏమైనా మేము పిచ్చోళ్ళమా అని నిలదీశారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని ఏనుగు రవీందర్ రెడ్డి స్పష్టం చేశారు. గత కొద్దిరోజులుగా ఏనుగు రవీందర్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరుతారన్న ప్రచారానికి చెక్ పెట్టారు.

టిఆర్ఎస్(బీఆర్ఎస్) లో తనను నమ్ముకున్న కార్యకర్తలకు సభ్యత్వం ఇచ్చేందుకు సభ్యత్వ నమోదు పుస్తకాలు ఇవ్వకుండా తనను అవమానించారని గుర్తు చేశారు. ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి, తాను ప్రస్తుతం కసిమీద ఉన్నామని, కేసీఆర్ ను బొందపెట్టి తీరుతామని రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Related posts

రైతు రుణమాఫీ సత్వరం పూర్తి చేయండి

Satyam NEWS

రైతాంగానికి సాయపడడంలో వైసీపీ ప్రభుత్వ విఫలం

Satyam NEWS

మేడ్చల్ -మల్కాజ్ గిరి జిల్లా నూతన ట్రెసా కార్యవర్గం ఎన్నిక

Satyam NEWS

Leave a Comment