30.7 C
Hyderabad
April 29, 2024 05: 01 AM
Slider జాతీయం

ఫైట్ విత్ లైఫ్:వేల పాములు పట్టినా ప్రాణాపాయ స్థితిలో

kerala snake catcher struggle with life ofter snake bite

పాములను అలవోకగా పడుతూ వాటిని పట్టడమే జీవన బృథిగా మార్చుకున్న పాముల సురేష్ అదే పాము కాటుకు గురై ప్రాణాలతో పోరాడుతున్నాడు.చిన్న వయసు నుంచే పాములను పట్టడంలో నేర్పరిగా అయిన సురేశ్, పాము కాటు తో ఇప్పుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.జనావాసాల్లోకి పాము వచ్చిందని తెలియగానే వెళ్లి, దాన్ని అదుపు చేసే సురేశ్ ను గతంలో ఎన్నో మార్లు పాములు కాటేశాయి.

కేరళను వరదలు ముంచెత్తిన సమయంలో వందలాది సర్పాలను సురేశ్ పట్టుకున్నాడు. తాజాగా, అత్యంత విషపూరితమైన రక్త పింజరి, సురేశ్ ను కాటేసింది. డాక్టర్లు అతనికి యాంటీ వీనమ్ ఇంజక్షన్ ఇచ్చినా, అది పని చేయలేదు. ఇప్పటికే పలు మార్లు యాంటీ వీనమ్ ఇంజక్షన్లను అతను చేయించుకుని ఉండటమే ఇందుకు కారణం.

అతని శరీరంలోకి ఎక్కిన యాంటీ వీనమ్ ఔషధం, రక్తపిజరి కాటుతో వెళ్లిన విషాన్ని అదుపు చేయడంలో విఫలమైంది. దీంతో మరో మూడు రోజులు గడిస్తేగాని సురేశ్ పరిస్థితిపై ఓ అవగాహనకు రాలేమని వైద్యులు స్పష్టం చేశారు.

Related posts

ఈనాడు దినపత్రిక కథనం కల్పితం

Satyam NEWS

జగన్ మోహన్ రెడ్డి రైతుల కోసం పాదయాత్ర చేయాలి

Satyam NEWS

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఒమిక్రాన్ వేరియంట్ ఆంక్షలు

Satyam NEWS

Leave a Comment