30.2 C
Hyderabad
September 28, 2023 13: 39 PM
Slider ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

ఈనాడు దినపత్రిక కథనం కల్పితం

eenadu

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ కేంద్రం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఈనాడు దినపత్రిక రాసిన కథనాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కార్యాలయం తీవ్రంగా ఖండించింది. రాజకీయ అంశాలు, రాజకీయ సమీకరణాలకు దూరంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఈ సమావేశాలు జరుగుతున్నాయని, ఇరురాష్ట్రాల ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ఇద్దరు ముఖ్యమంత్రులు పని చేస్తున్నారని సిఎం కార్యాలయం తెలిపింది. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశంలో అలాంటి అంశం ఏదీ ప్రస్తావనకు రాలేదని ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. ఊహాజనిత అంశాలు రాసి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని కార్యాలయం కోరింది. ఈనాడు దినపత్రిక కథనాన్ని ఖండిస్తున్నాం, ఉద్దేశపూర్వకంగా రాసిన కథనంగా భావిస్తున్నాం అని ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. గత నాలుగు నెలలుగా ఉభయ రాష్ట్రాల ప్రయోజనాల లక్ష్యంగా ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య సమావేశాలు జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా గోదావరి జలాలను తరలింపుద్వారా సాగర్‌ కుడికాల్వ కింద ఉన్న కృష్ణాడెల్టా, ప్రకాశం సహా రాయలసీమకూ, తెలంగాణలోని పాత మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు మేలు చేకూర్చే అంశంపై సుదీర్ఘ చర్చలు జరిగాయి.ఈ ప్రాజెక్టును సఫలం చేసే దిశగా నిశితంగా ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించారు. అదే విధంగా గత ఐదు సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలను కూడా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించారు. నిన్నటి సమావేశంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు తప్ప మరే ఇతర విషయాలూ  చోటు చేసుకోలేదని ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది

Related posts

శ్రీశైలంలో మహా శివరాత్రి భారీ వాహనాల దారి మళ్లింపు

Bhavani

అధికార పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేకు కరోనా

Satyam NEWS

మౌంట్ ఎల్బర్న్ పర్వతాన్ని అధిరోహించిన ములుగు వాసి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!