సాహితీవేత్తలందరు మెచ్చిన
సాహితీలోకం మరవని
రచనలెన్నో చేసిన
సాహితీ వనంలో వాడిపోని పరిమళమై నిలిచిన మేటి
జాషువా కవి
అవమానాలెన్నెదురైనా
తన కవిత్వం ఉన్నతమై
శిఖరం అదిరోహించిన మేటి
సరస్వతీ కటాక్షం కిరీటమై
అందమైన పద్యాలనందించిన
వెలుగు సూర్యుడు
నాడెన్ని మూఢచారులున్న
వాటిని
నిరసించి నిలదీసి నినదించిన
కవిశ్రేష్టుడాయన
నొప్పించని మనస్తత్వం
మానవత్వం మహోన్నతంగా
వికసించాలనే వాంఛతో
రచనా వ్యాసంగాన్ని నడిపారు
ఎన్నెన్నో అందమైన కావ్యాలు
ఆయన కలంనుండి జాలువారాయే
నేటికవి నిత్యనూతమై వెలుగులీనుతున్నయ్
ఆయన పొందిన ప్రశంసలెన్నో
పురస్కారాలకే వన్నెతెచ్చిన కవీశ్వరుడు
పద్మశ్రీ పద్మభూషణ్ లు
ఆయన రచనలకు ఆభరణాలు
ఆయన విశ్వనరుడు
రాజు మరణించి రాతిపలకలలో జీవిస్తే
సుకవి జీవించే ప్రజల నాలుకలయందన్నది చాలు
ఆయన కవితాకాశంలో
ఓ ధృవతారగా నిలవడానికి
సి. శేఖర్, పాలమూరు, సెల్ నెం: 9010480557