30.7 C
Hyderabad
April 29, 2024 03: 16 AM
Slider మహబూబ్ నగర్

కోడేరు ఎస్సైని సస్పెండ్ చేయాలని ఎస్పీకి ఫిర్యాదు

#nagarkurnoolpolice

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహ పట్ల కోడేరు ఎస్సై అవమానకరంగా మాట్లాడి అనుచిత వ్యాఖ్యలు చేసినందున ఎస్సైని వెంటనే సస్పెండ్ చేయాలని జిల్లా ఎస్పీ మనోహర్ కి సిపిఎం ప్రతినిధి బృందం ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్ధన్ పర్వతాలు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడు అందుబాటులో ఉండే సిపిఎం మండల కార్యదర్శి  నరసింహ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఇద్దరి సమస్య వినకుండా ఏకపక్షంగా మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలు చేసే నాయకుల పట్ల అవహేళనగా మాట్లాడుతున్న ఎస్సైని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

నాగులపల్లి తండా  భూమి విషయంలో బాధితులను తీసుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్తే నీకెందుకు వారి సమస్య అని నిన్ను పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి మాట్లాడడమే పెద్ద  తప్పు అని అవమానకరంగా మాట్లాడారని అన్నారు. అతనిపై దుర్భాషలాడుతూ బయటకు గెంటివేయమని చెప్పడం ఎస్ఐకి ఎంతవరకు సమంజసం అని ఆయన అన్నారు. పోలీస్ స్టేషన్ ఏమైనా వారి సొంత ఆస్తి లాగా అనుకొని  ప్రజలు ఇచ్చే జీతాలతో పనిచేసే వారు సమస్యలపై పోరాటం చేసే నాయకుల పట్ల అవహేళనగా మాట్లాడటం  తగదని ఆయన అన్నారు.

పై అధికారులు మాత్రం పెండ్లి పోలీస్ అని ప్రచారం చేస్తూ క్రింది స్థాయిలో మాత్రం ఇలాంటి ఎస్సై చీడపురుగులు ఉన్నారని అలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే కోడేరు పోలీస్ స్టేషన్ ముట్టడిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ శ్రీనివాసులు కందికొండ గీత జిల్లా కమిటీ సభ్యులు నరసింహ నాయకులు పొదిల రామయ్య పాల్గొన్నారు.

Related posts

పెట్రోల్ డీజిల్ ధరలతో ప్రజల నడ్డి విరుస్తున్న జగన్ దిగిపోవాలి

Satyam NEWS

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

Sub Editor

డబుల్ బెనిఫిట్: ఎక్కడా లేని విధంగా ఇళ్లు కట్టాం

Satyam NEWS

Leave a Comment