కొల్లాపూర్ డివిజన్ తెలంగాణ నాన్ గజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడుగా సయ్యద్ నసీరుద్దీన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొల్లాపూర్ తాసిల్దార్ కార్యాలయంలో ఆయన సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు. అదే విధంగా ఉపాధ్యక్షుడుగా సంక్షేమ శాఖ లో పని చేస్తున్న బాల్ రాజ్ ఎంపిక అయ్యారు.

కొల్లాపూర్ సిహెచ్ సి లో ఫార్మసిస్టుగా పని చేస్తున్న జి కె వెంకటేశ్ ను కార్యదర్శిగా ఎన్నుకున్నారు. జాయింట్ సెక్రటరీగా కొల్లాపూర్ ఐసిడిఎస్ లో సూపర్ వైజర్ గా పని చేస్తున్న శోభా రాణిని ఎన్నుకున్నారు. ఆర్గనైజింగ్ సెక్రటరీగా కె విజయకుమార్, కోశాధికారిగా ఏ పాండు రంగన్న, పబ్లిసిటీ కార్యదర్శిగా ఏ మల్లేష్, ఇసి సభ్యుడుగా బి మోహన్ కుమార్, ఇసి మహిళా సభ్యురాలిగా కె రాజేశ్వరి ఎన్నికయ్యారు.
ఈ ఎన్నికలను ఎన్నికల అధికారి పి.సంజీవ నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు బి వెంకటేష్, జిల్లా కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ జిల్లా కోశాధికారి మహ్మద్ షర్ఫొద్దీన్, ఉపాధ్యక్షలు వి రాఘవేందర్ రావు, మరో ఉపాధ్యక్షుడు పి సత్యనారాయణ యాదవ్ కొల్లాపూర్ డివిజన్ కార్యవర్గాన్ని అభినందించారు.