30.7 C
Hyderabad
April 29, 2024 05: 18 AM
తెలంగాణ

కొల్లాపూర్ అభివృద్ధిలో మహిళలు భాగస్వాములు కావాలి

ko mla

కొల్లాపూర్ లో నూతనంగా నిర్మించిన యోగా సాధన భవనాన్ని తమకు ఇవ్వాలని నిత్య యోగా సాధన సమితి కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిని కోరింది. మహిళలు యోగా చేసుకోవడం కోసం తమకు ఇవ్వాలని వారు బీరం హర్షవర్ధన్ రెడ్డి ని  మర్యాదపూర్వకంగా కలిసి అడిగారు.  కొల్లాపూర్ బాలికల పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మించిన యోగ భవనం మహిళలకు ఇవ్వాలని ఎమ్మెల్యే కి వినతిపత్రం అందజేశారు. మహిళలతో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి  మాట్లాడుతూ  కొల్లాపూర్ ప్రాంత అభివృద్ధిలో మహిళ సంఘాలు, మహిళలు   సహకరించాలని, అభివృద్ధి లో పాలుపంచుకోవాలని ఆయన కోరారు. పట్టణంలోని  కాలనీలలో ఏమైనా సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ఆయన తెలిపారు.

Related posts

జూన్‌ 12న టెట్‌

Sub Editor 2

మైలార్‌దేవ్ ప‌ల్లిలో ఫ‌లించిన తోక‌ల వ్యూహం

Sub Editor

ఇలాగైతే ఎలా యాదగిరి నర్సింహ స్వామీ?

Satyam NEWS

Leave a Comment