ఆర్టీసీ సమ్మె కారణంగా కొల్లాపూర్ పట్టణంలో లోని బస్టాండ్, బస్ డిపో పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు ఎస్సై కొంపల్లి మురళి గౌడ్ తెలిపారు. మంగళవారం ఎస్సై మురళి గౌడ్ విలేకరులతో మాట్లాడారు. పోలీస్ శాఖ ఆదేశాల మేరకు పట్టణంలో 144సెక్షన్ అమల్లోకి వచ్చిందన్నారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ ఆస్తులను, ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేసిన వారిపై కేసు నమోదు చేయబడుతుందన్నారు. అదేవిధంగా ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్ లను బెదిరిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. బుధ వారం నుండి ఆర్టీసీ బస్ స్టాండ్, డిపో ఆవరణ పరిధిలోకి కార్మికులకు అనుమతిలేదన్నారు. నాలుగురి కన్న ఎక్కువగా కనిపిస్తే కేసు నమోదు చేయబడుతుందన్నారు. పోలీస్ శాఖ అదేశలను పాటించాలన్నారు.
ఇసుక ట్రాక్టర్ పట్టి వేత కేసు నమోదు:కొల్లాపూర్ మండల పరిధిలోని మొల్ల చింతల పల్లి గ్రామ సమీపంలోని వాగు నుండి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న TS 31 T4411 ట్రాక్టర్ ను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎసై కొంపల్లి మురళి గౌడ్ తెలిపారు.