29.7 C
Hyderabad
May 1, 2024 04: 20 AM
Slider మెదక్

కొమురవెల్లి మల్లన్న ఆలయ చైర్మన్ రెడ్డి కులస్తులకు కేటాయించాలి

#ministerindrakaranreddy

మల్లన్న  కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం కల్పించి రెడ్డిలకు చైర్మన్ పదవి ఇస్తే ఆలయాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని రెడ్డి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బద్దూరి వెంకటేశ్వరరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న ఆలయ చైర్మన్ రెడ్డి కులస్తులకు కేటాయించాలని దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి  అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కమిషనర్ ని కలిసి వినతి పత్రం అందజేశారు.

మల్లన్న  కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం కల్పించి రెడ్డిలకు చైర్మన్ పదవి ఇస్తే ఆలయాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. కొమురవెల్లి మల్లన్న ఆలయ చైర్మన్ పదవి రాష్ట్రంలో ఉన్న రెడ్డి కులస్థులకు కేటాయించాలని రెడ్డి జేఏసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందించారు.

ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ రెడ్డిలకు మల్లన్న ఆలయ చైర్మన్ పదవి కేటాయించే వరకు ఉద్యమిస్తామన్నారు. కొమురవెల్లి మల్లన్న చరిత్రను పరిశీలిస్తే ఆదిరెడ్డి నీలమ్మ దంపతులకు జన్మించిన సంతానం. కొమురవెల్లి మల్లన్న గర్భాలయంలో బలిజ కులస్తులు పట్నాల మండలంలో ఒగ్గు పూజారులుగా యాదవ కులస్తులు లబ్ది పొందుతున్నారని తెలిపారు. రెడ్డి జాతికి చెందిన మల్లన్న ఆలయంలో రెడ్లకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

రెడ్డిలకు చైర్మన్ పదవి కేటాయిస్తే దేశవ్యాప్తంగా ఉన్న రెడ్డి లో సహకారంతో కొమురవెల్లి లో అన్నదాన సత్రాలు, వసతి గృహాలు నిర్మించి, మల్లన్న దర్శనానికి వచ్చే లక్షలాది మందికి  సేవలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి జేఏసీ రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శి, పాకాల రాజిరెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ మహిళ అధ్యక్షురాలు దేవిరెడ్డి విజిత రెడ్డి, ఎల్.బి నగర్ చల్ల గీత రెడ్డి, విద్య విభాగం పొత్తి రెడ్డి రాజశేఖర్ రెడ్డి, యూత్ రాష్ట్ర ఇంఛార్జి ఎం.కిరణ్ కుమార్ రెడ్డి, సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు వట్టిపల్లి రాజిరెడ్డి, కొమురవెల్లి మండల అధ్యక్షులు జొర్రీఈగల మల్లారెడ్డి, జిల్లా నాయకులు నరెడ్ల శ్రీనివాస్ రెడ్డి, నిమ్మ మహిపాల్ రెడ్డి, శెట్టిపల్లి విజేందర్ రెడ్డిలు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

బస్తీ దవాఖానాల ద్వారా ఉచిత వైద్య సేవలు

Murali Krishna

కాఫ్టర్ క్రాష్ : హెలికాప్టర్ కూలి ఇద్దరు మిలటరీ పైలట్ల మృతి

Satyam NEWS

ఉప్పల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ విభాగం జలమండలికి అప్పగింత

Satyam NEWS

Leave a Comment