31.7 C
Hyderabad
May 2, 2024 10: 01 AM
Slider గుంటూరు

బ్లాక్ ఫంగస్ ఔషధాలు జనఔషధి దుకాణాల్లో పెట్టాలి

#lavu krishnadevarayalu

బ్లాక్ ఫంగస్ ఔషధాలు దేశవ్యాప్తంగా జనఔషధి దుకాణాల్లో అందుబాటులో ఉంచాలని కేంద్రానికి గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు పెరిగి పోతున్న బ్లాక్ ఫంగస్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన ప్రధానికి, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఈ ఫంగల్ ఇన్ఫెక్టన్ కోసం వాడే ఔషధం Amphotericin ఎం ఆర్ పి ధర సుమారు ఐదు వేల చిల్లర గా ఉండగా ప్రభుత్వం వద్ద పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో లేకపోవడంతో రోగులు బ్లాక్ మార్కెట్ లో 70 వేల నుంచి లక్ష రూపాయలు దాకా పెట్టి కొనాల్సిన పరిస్థితి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

కాబట్టి బ్లాక్ ఫంగస్ సంబంధిత ఔషధాలు ప్రభుత్వ జన ఔషది దుకాణాల్లో అందుబాటులో ఉండే విధంగా చేయాలని కోరారు.

ఈ బ్లాక్ ఫంగస్ గురించి ప్రజల్లో ఔగాహన కల్పించే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోడీ, ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్ కి లావు శ్రీకృష్ణదేవరాయలు లేఖలు రాశారు.

Related posts

కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

Satyam NEWS

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ప్రజల తిరుగుబాటు

Satyam NEWS

Best How To Decarb Cbd Hemp In Coconut Oil Site Edu Cbd Hemp Variety Trial

Bhavani

Leave a Comment