38.2 C
Hyderabad
April 29, 2024 14: 01 PM
Slider ముఖ్యంశాలు

కలియుగ అపర కర్ణుడు కొంకపాక వెంకటేశ్వర ఇకలేరు

#konkapaka

కలియుగ అపర కర్ణుడిగా పేరు గడించిన కొంకపాక వెంకటేశ్వర శర్మ ఇకలేరు అన్న వార్త యావత్ ఉమ్మడి నల్లగొండ జిల్లా బ్రాహ్మణ,అర్చకులను తీవ్రంగా కలచివేసింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్ళచెరువు మండల కేంద్రంలో స్వయంభువుగా వెలసిన శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి సుప్రసిద్ధ ఆలయంలో ప్రధాన అర్చకులుగా పనిచేసి,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాల అర్చకులకు పే స్కేల్ ఇవ్వాలని తన సొంత ఖర్చులతో పోరాటం చేసిన ఉదార ఉద్యమ స్ఫూర్తి ప్రదాత కొంకపాక వెంకటేశ్వర శర్మ.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈయన అంటూ తెలియని వారు ఉండరు.స్వయంభు శంభు లింగేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేస్తూ, అన్నార్తులకు అన్నదాతగా,ఎడమ చేతికి తెలియకుండా కుడిచేత దానధర్మాలు చేసిన అపర కర్ణుడు కొంకపాక వెంకటేశ్వర శర్మ.80 సంవత్సరాల వయసులో కూడా బ్రాహ్మణ బంధువులకు ఏ అవసరం ఉన్నా నేనున్నానంటూ ధైర్యాన్ని నింపి హార్దిక, ఆర్థిక సహాయం అందిస్తూ,తన సతీమణి కస్తూరి పేరున కళ్యాణ మంటపం నిర్మించి పేదల వివాహాలకు ఉచిత సేవలందించిన మహా మనిషి.ప్రాంత భేదం,కులమత భేదం,లేకుండా అడిగిన వెంటనే లేదనకుండా సహాయమందించిన ఉదార దాన గుణ శాలి కొంకపాక వెంకటేశ్వర శర్మ ఆదివారం మధ్యాహ్నం ఇకలేరు అన్న దుర్వార్త విన్న యావత్ ఉమ్మడి నల్లగొండ జిల్లా,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని బ్రాహ్మణ సంఘాలు,అర్చక లోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.కొంకపాక వెంకటేశ్వర శర్మ పవిత్ర ఆత్మకు భగవంతుడు శాంతిని చేకూర్చాలని పలు బ్రాహ్మణ సంఘం నేతలు,బ్రాహ్మణులు,అర్చకులు ముక్కోటి దేవతలను ప్రార్థించారు.

షిరిడి సాయిబాబా మందిర నిర్మాణం ట్రస్ట్ చైర్మన్ గా,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అర్చక సంఘం గౌరవ అధ్యక్షుడిగా,అపర దాన గుణ శాలి,అర్చక సంఘ ఆశాజ్యోతి, బ్రాహ్మణ సంఘాల అభివృద్ధి ప్రదాత  కొంకపాక వెంకటేశ్వర శర్మ కు మట్టపల్లి మహా క్షేత్ర శ్రీ లక్ష్మీనరసింహ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం కమిటీ అధ్యక్షుడు కొండపల్లి సింగయ్య,ప్రధాన కార్యదర్శి చెన్నూరు మట్టపల్లి రావు, కోశాధికారి బాచిమంచి గిరిబాబు, ఉపాధ్యక్షుడు నారపరాజు పురుషోత్తమరావు,పుల్లాభొట్ల శివ,సభ్యులు ధూళిపాళ రామకృష్ణ ప్రసాద్,రంగరాజు వాసుదేవరావు,భువనగిరి శ్యామ్ సుందర్, అన్నంభొట్ల ఫణికుమార్ శర్మ,రాయప్రోలు శ్రీరామయ్య శర్మ,బొబ్బిళ్ళపాటి శేషు, పులిజాల శంకర్రావు,పుష్ప,సత్రం సిబ్బంది, శ్రీ లక్ష్మీనృసింహ వేద స్మార్త పాఠశాల కమిటీ సభ్యుడు బాచిమంచి చంద్రశేఖర్ శర్మ,పాఠశాల అధ్యాపకులు చీమలపాటి ఫణి శర్మ,తేజోమూర్తుల రవి శర్మ సంతాపం ప్రకటించారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

సింహ‌ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు

Satyam NEWS

ప్రతి కార్యకర్త కుటుంబానికి పార్టీ అండ

Bhavani

ప్రజా సేవలో ఆకాశం ఎత్తుకు వెళ్లిన సాయి సుధ

Satyam NEWS

Leave a Comment