40.2 C
Hyderabad
April 26, 2024 13: 03 PM
Slider ఆధ్యాత్మికం

సింహ‌ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు

#Simhavahanam

తిరుమల శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన ఆది‌వారం ఉదయం 9 గంట‌లకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు సింహ‌ వాహనంపై అభ‌య ఆహ్వాన‌ న‌ర‌సింహ‌స్వామి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. 

శ్రీవారు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహ‌నాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం.

ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంత‌మ‌వుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజ‌య‌స్ఫూర్తి సిద్ధిస్తుంది.

 అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు భక్తులకు తెలియ చేస్తున్నారు.

రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ముత్య‌పుపందిరి వాహనంపై స్వామివారు అభ‌య‌మిస్తారు.

Related posts

తెలంగాణ మా కంచుకోట… ఎవరూ బద్దలు కొట్టలేరు

Satyam NEWS

ఉపాధ్యాయులకు తీరని అన్యాయం చేస్తున్న ప్రభుత్వం

Satyam NEWS

కిటకిటలాడుతున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం

Bhavani

Leave a Comment