28.2 C
Hyderabad
May 9, 2024 00: 33 AM
Slider కృష్ణ

గొప్ప మనసు చాటుకున్నకలెక్టర్ ఇంతియాజ్

#KrishnaDtCollector

విద్యార్థులను డాక్టర్లుగా ఇంజనీర్లుగా లాయర్లుగా శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడు నేడు ఈ కరోనా మహమ్మారి నేపథ్యంలో చెప్పులు అమ్ముకుంటున్నాడు.

వెంకటేశ్వరరావు అనే ఉపాధ్యాయుడి కథ ఇది. ఆయన పని చేసే స్కూల్ మూతపడటంతో ఉపాధి కరువై కుటుంబ పోషణ నిమిత్తం విజయవాడ బి ఆర్ టి స్ రోడ్ లో  పాదరక్షలు విక్రయిస్తున్నాడు.

ఈ విషయం ప్రసార మాధ్యమాల ద్వారా కృష్ణా జిల్లా కలెక్టర్ ఎండి ఇంతియాజ్ తెలుసుకున్నారు. స్వయంగా ఆ ఉపాధ్యాయుడి దగ్గరికి  వెళ్లి అతని పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.

నేనున్నాను అని అతనిలో మనోధైర్యం నింపి కుటుంబ పోషణకు తగు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.

జిల్లాలో ఎక్కడైనా ఔట్సోర్సింగ్ ద్వారా  ఉద్యోగం కానీ వ్యాపార నిమిత్తం రుణ సదుపాయం ఏర్పాటు చేస్తానని చెప్పి ఆ ఉపాధ్యాయుడికి ఆత్మవిశ్వాసం కల్పించారు.

ఈ పరిణామంతో ఇంకా మానవత్వం బతికే ఉందని కలెక్టర్ నిరూపించారని పలువురు స్థానికులు కొనియాడారు.

Related posts

రైతు,కార్మిక చట్టాల సవరణ నిలిపి వేసే దాకా ఉద్యమం ఆగదు

Satyam NEWS

పుల్కల్ సొసైటీ చైర్మన్ గా ఇందిరా దేశాయి ప్రమాణం

Satyam NEWS

పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖురేషీకి కరోనా పాజిటీవ్

Satyam NEWS

Leave a Comment