38.2 C
Hyderabad
April 29, 2024 12: 08 PM
Slider నల్గొండ

పేదల కడుపు కొడుతున్న నిర్లక్ష్యపు అధికారులు

#DevarakondaRDO

నల్గొండ జిల్లా దేవరకొండ మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో పేదల కడుపు కొడుతున్న అధికారులకు నిరసనగా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. బహుజన సైన్యం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్ట్ న్యాయవాది పోలే విష్ణు మాట్లాడుతూ 1999లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వే నెంబర్ 102, 105 భూములను స్థల యజమానుల నుంచి సేకరించిందని ఆయన తెలిపారు.

ఈ భూములకు ప్రభుత్వం స్థల యజమానికి పరిహారం చెల్లించింది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో పేదలకు పంచి పెట్టిందని ఆయన చెప్పారు. అయితే వీఆర్వో, దిండి తాసిల్దార్ లు ఆ భూమిని బిట్ల లక్ష్మమ్మ పేరున రెవిన్యూ రికార్డులలో నమోదు చేశారు.

ఆమె పేరుతో పాస్ బుక్ కూడా జారీ చేశారు. ఇది అన్యాయమని పేదల కడుపు కొట్టడం సహించరాని విషయమని ఆయన అన్నారు. బహుజన సైన్యం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్రగుంటపల్లి గ్రామ ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తున్న ఎర్ర వెంకటేష్ మాట్లాడుతూ గ్రామ పేద ప్రజలకు ప్రభుత్వం వెంటనే ఇళ్ల స్థలాలకు మళ్ళీ పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బహుజన సైన్యం రాష్ట్ర కమిటీ సభ్యులు కోశాధికారి దర్శనం యాదగిరి, ప్రధాన కార్యదర్శి దున్న బాలకృష్ణ, ఉపాదక్షులు అడేపు త్యాగరాజు, ఎగ్జిక్యూటీవ్ మెంబర్ యనమల విష్ణు, నాగార్జున సాగర్ నియోజకవర్గ అధ్యక్షులు సల్వాది ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి ఊర నవీన్ పాల్గొన్నారు.

ఇంకా దేవరకొండ నియోజక వర్గ సభ్యులు మురళి, పి.ఏ.పల్లి మండల అధ్యక్షులు రొయ్య యాదగిరి, డిండి మండల అధ్యక్షులు లక్ష్మణ్, జర్నలిస్ట్ జంతుక లింగం పాల్గొన్నారు.

వీరితో బాటు ఎర్రగుంటపల్లి గ్రామ ప్రజలు ఎరుకల తిరుపతయ్య, ఎర్ర యాదగిరి, కుర్మెటి కృష్ణ, గ్యార మహేష్, బొర్ర ముత్తయ్య, మెళ్ళ జంగయ్య, మెళ్ళ లక్మయ్య, ఏర్పుల అంజయ్య, గ్యార కృష్ణయ్య,మెదరి తిరుపతియ్య,ఏర్పుల కృష్ణయ్య ,ఎర్ర అంతయ్య కూడా పాల్గొన్నారు.

Related posts

విజయనగరంలో ఒకే రోజు ముగ్గురు సీఐల బాధ్యతల స్వీకరణ

Satyam NEWS

ఆరో విడత హరితహారంలో మొక్కలు నాటిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి

Satyam NEWS

సేఫ్ హ్యాండ్స్: కరోనా కట్టడికి ముందస్తు చర్యలు

Satyam NEWS

Leave a Comment