38.2 C
Hyderabad
April 28, 2024 19: 47 PM
Slider ముఖ్యంశాలు

రేపు కేటీఆర్, రేవంత్ రెడ్డి రాక: హాట్ హాట్ గా కామారెడ్డి రాజకీయాలు

#revanthreddy

సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్ది ముఖ్య నాయకుల పర్యటనలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ నెల 9వ తేదీన సీఎం కేసీఆర్ కామారెడ్డిలో నామినేషన్ వేసిన అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు. టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేను కొనుగోలు చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వ్యక్తి అని అలాంటి వ్యక్తి తనపై పోటీ చేస్తాడట అని విమర్శించారు.

మరుసటి రోజు 10 వ తేదీన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నామినేషన్ వేసి కామారెడ్డిలో బిసి డిక్లరేషన్ ప్రకటించి ఎమ్మెల్యే కొనుగోలు కేసులపై ఈడి, సిబిఐ విచారణకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. తర్వాత ఈ నెల 14 వ తేదీన ఉమ్మడి మాచారెడ్డి మండలంలో ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 15 వ తేదీన నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి 24 గంటల కరెంట్ సరఫరా నిజమని నిరూపిస్తే కామారెడ్డి, కొడంగల్ లో నామినేషన్ ఉపసంహరించుకుంటానని సవాల్ చేశారు. ఈ రెండు సవాళ్లు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో కామారెడ్డి నియోజకవర్గంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రేపు ఒకేరోజు పర్యటించనుండటం హాట్ టాపిక్ గా మారుతోంది.

రేపు ఉమ్మడి దోమకొండ, బిక్కనూర్ లో కేటీఆర్ పర్యటన

కామారెడ్డి నియోజకవర్గంలోని ఉమ్మడి దోమకొండ, బిక్కనూర్ మండలాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. బిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో  ఉదయం 11 గంటలకు నిర్వహించే సభలో కేటీఆర్ పాల్గొననున్నారు. అలాగే మధ్యాహ్నం 2 గంటలకు కాచాపుర్, మాందాపూర్, జనగామ గ్రామాల్లో రోడ్ షో లో పాల్గొననున్నారు. 3 గంటలకు బిబిపేట మండల కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొంటారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.

రేవంత్ రెడ్డి పర్యటన

నియోజకవర్గంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో ప్రచారంలో పాల్గొని సాయంత్రం 4 గంటలకు రాజంపేట మండల కేంద్రంలో సాయంత్రం 6 గంటలకు బిక్కనూర్ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసిన తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్

Sub Editor

పెండ్యాల కోటేశ్వరరావు జీవితం భావితరాలవారికి ఆదర్శం

Satyam NEWS

గంటా శ్రీనివాస రావుకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ధర్నా

Satyam NEWS

Leave a Comment