40.2 C
Hyderabad
April 26, 2024 12: 52 PM
Slider ప్రత్యేకం

హౌ టు విన్:రేవంత్ దెబ్బకు మల్లారెడ్డి మంత్రి పదవి మటాష్

revanth mallareddy war

మున్సిపల్ ఎన్నికలలో ఓడిపోతే మంత్రి పదవి ఊడుతుందని పార్టీ అధినేత సీఎం కేసీఆర్ మంత్రులకు వార్నింగ్ ఇవ్వడం తో మేడ్చల్ జిల్లా ఏకైక మంత్రి మల్లారెడ్డికి గుబులు పట్టుకుంది.తన మంత్రి పదవికి కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, మల్కాజిగిరి ఎంపీ టి పి సి సి కార్య నిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని నేరుగా కాకపోయినా ఇన్ డైరెక్టుగా ఢీ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

హైదరాబాద్ చుట్టు పక్కల కొత్తగా ఏర్పడిన జవహర్‌నగర్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, నిజాంపేట కార్పొరేషన్లు, మేడ్చల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, తూంకుంట, ఘట్‌కేసర్, దమ్మాయిగూడ, నాగారం, దుండిగల్, పోచారం మున్సిపాలిటీలు మంత్రిగా మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్ జిల్లా పరిధిలోనే ఉన్నాయి. ఈ నాలుగు కార్పొరేషన్లు, తొమ్మిది మున్సిపాలిటీలకు ఈ నెల 22న పోలింగ్ జరగనుంది. వీటి మేయర్, చైర్ పర్సన్ కుర్చీలను కైవసం చేసుకునే బాధ్యత మల్లారెడ్డి పైనే ఎక్కువగా ఉంది.

సింగిల్ కార్పొరేషన్ బాధ్యతే కష్టమంటే మల్లారెడ్డికి ఒకేసారి నలుగురు మేయర్లు, 9 మంది చైర్‌పర్సన్‌లను.. అదీ రేవంత్ లాంటి మాస్‌లీడర్‌ను ఎదుర్కొని గెలిపించడం అంత వీజీ కాదు. ఈ ఎన్నికలు ఓ పక్క మల్లారెడ్డికి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో జరిగేవి కాగా మరో పక్క రేవంత్‌కు తన లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో జరిగేవి అవడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలామందే ఉన్నప్పటికీ రేవంత్ ధాటిని తట్టుకొని ఇక్కడ ఎన్నికలు గెలవాల్సిన ఎక్కువ అవసరం మాత్రం మంత్రిగా మల్లారెడ్డికే అధికంగా ఉంది. మున్సిపల్ ఎన్నికలు ఓడిపోతే మంత్రి పదవి ఊడుతుందని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అనడంతో మల్లన్న మంత్రి పదవికి రేవంత్ రూపంలో ప్రమాదం వచ్చినట్లయింది.

         

Related posts

రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడిస్తాం

Satyam NEWS

అంబిషన్: అమెరికాతో ఉద్రిక్తతలు తగ్గాలనే కోరుకుంటున్నాం

Satyam NEWS

గుడిసెల్లో బతుకుతున్నవారిని రోడ్డున పడేసిన కేసీఆర్

Satyam NEWS

Leave a Comment