33.7 C
Hyderabad
April 30, 2024 02: 06 AM
Slider ముఖ్యంశాలు

ఎస్సీ ఎస్టీ వాడల్లో దేవాలయాల నిర్మాణం

#LordBalaji

తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో ఎస్సీ ,ఎస్టీ ,బీ సి వర్గాలకు చెందిన వెనుకబడిన ప్రాంతాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీరామాలయాల నిర్మాణాలు చేపట్టనున్నామని దేవాదాయ, ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ జి.ఏకాంబరం ఒక ప్రకటన లో తెలిపారు. ఆయా గ్రామాలలో  ఈ ఆలయాలను నిర్మించాలి అనుకున్నవారు లొకేషన్, సైట్ ప్లాన్, సదరు ఆలయ నిర్మాణానికి అనువుగా ఉందని భావిస్తే టిటిడి అధికారులు పరిశీలించి ఒక్కొక్క  ఆలయానికి రూ.10,00,000/- చొప్పున నిధులను కేటాయించనున్నారన్నారు. ఈ ఆలయ నిర్మాణం విషయంలో కమిషనర్ క్రింది నిబంధనలను జారీ చేశారని,  అవి..

1. గ్రామాలలోని దళితవాడలు, ట్రైబల్ ఏరియా, మత్సకార కాలనీలు, వెనుకబడిన ప్రాంతాలలో ముఖ్యమైన ఆలయములు లేనిచోట పరిగణించబడుతుంది.

2. గుర్తించిన ప్రాంతంలో 10  సెంట్లు స్థలాన్ని రెవెన్యూ అధికారులు ధ్రువీకరించి ఉండాలి.

3. ఆయా ప్రాంతంలో ఎలాంటి ఆలయాలు లేవని సంబంధిత గ్రామస్థుడు దేవాదాయ శాఖకు అర్జీ సమర్పించాలి.

4. టీటీడీ జారీచేసిన డిజైన్ లోనే రాష్ట్రంలో ఆలయ నిర్మాణం జరుగుతుందని వారు ఆ ప్రకటనలో తెలిపారు.

Related posts

విలన్ గా వస్తున్న కుమారి 21 ఎఫ్ హెబ్బా

Satyam NEWS

ఏప్రిల్ 24 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు

Satyam NEWS

విషాదాంతం: హైదరాబాద్‌లో ఓయో ఉద్యోగిని ఆత్మహత్య

Satyam NEWS

Leave a Comment