హెలికాప్టర్ ప్రమాదంలో బాస్కెట్‌బాల్ ప్లేయర్ కోబ్ బ్రియంట్ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై తెలంగాణమంత్రి కేటీఆర్ స్పందిస్తూ ‘బ్రియాంట్, అతడి కుమార్తె మరణవార్త తెలిసి షాక్‌కు గురయ్యాను. కొబ్ బ్రయంట్ తన 20 ఏళ్ల కెరియర్‌లో పలు రికార్డులు సాధించారు. నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ తరపున ఆడి ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచారు.
18సార్లు ఆల్ టైమ్ స్టార్‌గా నిలిచారు. 2016లో ఎన్బీఏ నుంచి మూడవమారు ఆల్ టైమ్ స్కోరర్‌గా రిటైర్ అయ్యారు. కొబ్ బ్రయంట్ 2012 ఒలింపిక్స్‌లో యూఎస్ టీమ్ తరపున ఆడి రెండు స్వర్ణపతకాలు అందుకున్నారు. నా అభిమాన ప్రపంచ స్థాయి ఆటగాడికి నా కన్నీటి వీడ్కోలు’ అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను అంటూ ఆయనకు సంబందించిన ఒక ఫోటోను షేర్ చేసారు.