42.2 C
Hyderabad
April 26, 2024 18: 23 PM
Slider ముఖ్యంశాలు

చదువుల తల్లికి ఏమెల్యే బీరం ఇచ్చే విలువ ఇదేనా?

#MLABeeram

యావత్ భారత దేశమంతా సావిత్రి బాయి పూలే  ఘన నివాళులు అర్పిస్తూ ఉంటే కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి కొల్లాపూర్ మినీ స్టేడియంలో భారీ సిక్సర్ల కోసం ప్రయత్నించారు. ఎందుకోసమో తెలియదు. ఆదివారం చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 189 వ జయంతి సందర్భంగా కొల్లాపూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, ఉద్యోగులు  ఘనంగా జరుపుకున్నారు.

సావిత్రిబాయి పూలే ను ప్రతి ఒక్కరు స్మరించుకున్నారు. మేధావులు బహుజన వాదులు, విద్యావంతులు  సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కానీ  ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి సావిత్రిబాయి పూలే పై అభిమానం ఉందో లేదో తెలియదు.

కానీ జయంతినా స్థానికంగా ఉండి కూడా  కనీసం క్యాంపు కార్యాలయంలో లేదా ఇంటి దగ్గర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించ లేదు. స్థానికంగా లేరంటే ఏమనుకోవాలి. స్థానికంగా ఉండి కూడా ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పై మేధావులు విమర్శిస్తున్నారు.

ఎమ్మెల్యే సావిత్రిబాయి పూలే గొప్పతనాన్ని ఆమె విలువలను ప్రజలకు తెలియజేయాలి. కానీ ఆ విధంగా చెయ్యలేదు. కనీసం ముఖ్య అతిథిగా కార్యక్రమాలకు వెళ్లి నివాళులర్పించాలి. అలాంటి సందర్భం జరగలేదు. కేవలం నియోజకవర్గ ప్రాంతంలో  పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

పెళ్లిళ్ల, దర్గాల దగ్గర కి వెళ్ళడానికి సమయం ఉన్నది కానీ భారతదేశంలోని మహిళలకు చదువు నేర్పిన తల్లికి ఎమ్మెల్యే స్థానికంగా ఉండి కూడా నివాళులర్పించలేదు. పట్టణంలో ఉదయాన్నే మినీ స్టేడియంలో బ్యాట్ పట్టుకొని భారీ సిక్సర్లకు ప్రయత్నించారు. యువతతో ఎంజాయ్ చేశారు.

కానీ చదువుల తల్లికి నివాళులర్పించ లేదు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బహుజన మహనీయులకు ఎమ్మెల్యే ఇచ్చే గౌరవం ఇదేనా? అని మేధావులు, బహుజన వాదులు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే సాయంత్రం శ్రీశైల సన్నిధానంలో కనిపించారు.

Related posts

గుడిసెల్లో బతుకుతున్నవారిని రోడ్డున పడేసిన కేసీఆర్

Satyam NEWS

హన్మకొండలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం

Satyam NEWS

కరోనా ఎఫెక్ట్: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి కి ఆర్జిత సేవలు రద్దు

Satyam NEWS

Leave a Comment