కడప డీ ఎం హెచ్ ఓ కార్యాలయం వద్ద కాంట్రాక్టు ల్యాబ్ టెక్నీషియన్ లు ఆత్మహత్యాయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులలో అక్రమాలు జరిగాయని డీఎంహెచ్వో ఆఫీస్ ఎదుట అభ్యర్థుల ఆందోళన చేశారు. అఫీషియల్ గా 6 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి 30 నియామకాలు చేపట్టినట్లు బాధితులు ఆరోపించారు.
న్యాయం చేయాలని లేని పక్షంలో ఆత్మహత్యలకు కూడా సిద్ధమంటున్నారు. జిల్లా అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని వారు కోరారు.
కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కోవిడ్ విధులు కేటాయించి, అవి ముగిసిన వెంటనే పూర్వ స్థానాల్లోకి తీసుకుంటామని అధికారులు వివరణ ఇచ్చారు.