28.7 C
Hyderabad
April 27, 2024 03: 44 AM
Slider మహబూబ్ నగర్

రామాపురం భూముల పై సమగ్ర విచారణ చేపట్టాలి

#Ramapuram

రామాపురం గ్రామంలో 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నవారిని కాదని కొందరు అక్రమార్కులకు పట్టాలు ఇస్తున్నారని కెవిపిఎస్ ప్రతినిధులు నిరసన తెలిపారు.

ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని కెవిపిఎస్ ఆధ్వర్యంలో  నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఆర్డీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ రాజేశ్వరి కి వినతిపత్రం సమర్పించారు.

రామాపురం లో 87 .113. 223 సర్వే నెంబర్లలో గత 50 సంవత్సరాల కు పైగా సాగులో ఉన్న రైతులకు కాకుండా గత కొన్ని రోజుల క్రితం అడవిని సాగు చేసిన కొంతమందికి పట్టాలు ఇచ్చారని కెవిపిఎస్  మండల ప్రధాన కార్యదర్శి  బత్తిని రాజు  సీనియర్ నాయకులు రాము అన్నారు.

గ్రామంలో కొంతమంది రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని తమకు కావాల్సిన వాళ్లకు మాత్రమే పట్టాలు ఇప్పించు కుంటున్నారని వారు తెలిపారు.

అలా కాకుండా ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా బినామీ పేరుతో ఉన్న భూములను తొలగించి సెంటు భూమి లేని నిరుపేద దళితులకు ఆ భూమిని పంచాలని వారు డిమాండ్ చేశారు.

రాజకీయాలకు సంబంధం లేకుండా అసలైన లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు లు రవి, మధు, రవి కుమార్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ధైర్యంగా ఊరెళ్ళండి.. ఆనందంగా పండుగ జరుపుకోండి

Bhavani

ఎన్నిక‌ల ఖ‌ర్చుపై పునఃప‌రిశీల‌న‌లో సీఈసీ

Sub Editor

కూటమి గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలి

Satyam NEWS

Leave a Comment