30.7 C
Hyderabad
April 29, 2024 04: 28 AM
Slider విజయనగరం

అధికార లాంఛ‌నాలతో జ‌వాన్ జ‌గ‌దీష్ అంత్య‌క్రియ‌లు

#JawanJagadeesh

భీక‌ర కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జ‌వాన్ రౌతు జ‌గ‌దీష్ అంత్య‌క్రియ‌లు…విజ‌య‌న‌గ‌రంలో అదికార లాంఛ‌నాల మ‌ధ్య జ‌రిగాయి. న‌గ‌రంలోని గాజుల రేగ‌లోని శ్మ‌శాన వాటిక‌లో…సెంట్ర‌ల్ రిజ‌ర్వ్ పోలీస్ ఐజీ,డీఐజీ, విజ‌య‌న‌గ‌రం జిల్లా జాయంట్ క‌లెక్ట‌ర్ కిషోర్ కుమార్, ఆర్డీఓ భ‌వానీ శంక‌ర్ లు  జ‌వాన్ జ‌గ‌దీష్ అంత్య‌క్రియ‌లు ద‌గ్గరుండీ నిర్వ‌హించారు.

అంత‌కుమందు గాజుల రేగ‌లోని జ‌వాన్ జ‌గ‌దీష్ ఇంటి వ‌ద్ద ఉన్న  విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు, ఏఆర్ డీఎస్పీ శేషాద్రి,విజయ‌న‌గ‌రం డీఎస్పీ అనిల్ లు..మృత‌దేహానికి పుష్ప గుచ్చం ఉంచి నివాళులు అర్పించారు.

అలాగే సెంట్ర‌ల్ రిజ‌ర్వు పోలీస్ ఐజీ,డీఐజీ కోట్రా ద‌ళం అధిప‌తి…అలాగే ఏఆర్, లా అండ్ ఆర్డ‌ర్ సిబ్బంది…జ‌వాన్ జ‌గ‌దీష్ మృత‌దేహానికి నివాళులు అర్పించారు. ముందు రోజు రాత్రే…ఛ‌త్తీస్ ఘ‌డ్ నుంచీ రోడ్ మార్గం మీదుగా స్వ‌స్థ‌లానికి జ‌వాన్ జ‌గ‌దీష్ మృత‌దేహం వ‌చ్చింది. 

ఈ ఉద‌యం…అధికార లాంచ‌నాల‌తో అటు రెవిన్యూ,ఇటు పోలీస్ శాఖ‌లు జ‌గ‌దీష్ ఫ్యూన‌ర‌ల్ ఏర్పాట్లు నిర్వ‌హించ సాగాయ.ముందు రోజు మ‌ధ్యాహ్న‌మే  గాజుల రేగ‌లో జ‌గ‌దీష్  క‌న్న‌వాళ్ల‌ను ఎస్పీ రాజ‌క‌మారీ ప‌రామర్శించి..జ‌వాన్ చిత్ర ప‌ఠానికి పూల మాలు వేసి నివాళులు అర్పించారు.

ఉద‌యాన్నే గాజుల‌రేగ‌లో స్వస్థ‌లానికి  వ‌చ్చిన జ‌గ‌దీష్  మృతదేహంపై సీఆర్పీఎస్ ద‌ళం…జాతీయ ప‌తాకాన్ని ఉంచి..సెల్యూట్ చేసారు. అక్క‌డ నుంచీ ఊరేగింపులో బ‌య‌లు దేరి…శివారున ఉన్న శ్మ‌శానికి మృతదేహం చేరుకుంది.అప్ప‌టికే జేసీ కిషోర్ కుమార్,ఆర్డీఓ భ‌వానీ  శంక‌ర్, సీఆర్పీఎఫ్ ఉన్న‌తాధికారులు…ద‌గ్గ‌రుండీ అంత్య‌క్రియ‌ల‌కు ఏర్పాటు చేసారు.

న‌లుగురు    కోబ్రా కమాండెంట్ లు  జ‌వాన్ జ‌గ‌దీష్ మృత‌దేహాన్ని ఓ చెక్ పెట్టెలో భ‌ద్ర ప‌రిచి…దానిపై జాతీయ జెండా ఉంచి..దాన్ని ఓ గౌర‌వ సూచికంగా భావించి..బ్యాండ్ తో శ్మ‌శానానికి తీసుకువ‌చ్చారు. జ‌వాన్ జ‌గ‌దీష్ కుటం సంప్ర‌దాయ ప్ర‌కారం..తండ్రి భుజాన కుండ పెట్టుకుని మూడు సార్లు మృతదేహం చుట్టి దిరిగారు.

ఆ త‌ర్వాత మృత‌దేహానికి రెండు వైపు ఓ ఏఆర్ సిబ్బంది మ‌రో వైపు సీఆర్పీఎఫ్ సిబ్బంది…గౌర‌వ సూచికంగా మూడు రౌండ్లు గాలిలో కాల్పులు జ‌రిపారు.అనంత‌రం..రౌతు జ‌గ‌దీష్ తండ్రి త‌మ ప‌ద్ద‌తి ప్ర‌కారం…అంత్య‌క్రియ‌లు పూర్తి చేసారు.

అత్యంత  కోలాహాలం..భార‌త్ మాతాకీ జై  అన్న నినాదాల‌తో బ‌రియ‌ల్ గ్రౌండ్…మారుమోగింది. చివ‌రకు అశ్రున‌య‌నాల‌తో క‌డ‌సారి గా జ‌వాన్ జ‌గ‌దీష్ కు యావ‌త్ విజ‌య‌న‌గ‌రం ప్ర‌జ‌లు వీడ్కోలు పలికారు.

Related posts

కేంద్ర ప్రభుత్వ విధానాలపై శానంపూడి సైదిరెడ్డి మండిపాటు

Satyam NEWS

అధికారానికి “తీన్మార్” ఇప్పుడే మొదలైంది

Satyam NEWS

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మోడీ పాత్ర ఏమిటి?

Satyam NEWS

Leave a Comment