29.7 C
Hyderabad
April 29, 2024 08: 13 AM
Slider జాతీయం ముఖ్యంశాలు

అస్వస్థత నుంచి కోలుకున్న గాయని లతా మంగేష్కర్

latha mang

ప్రముఖ నేపథ్య గాయని లతా మంగేష్కర్​ అస్వస్థత కారణంగా ముంబయిలోని బ్రిచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం కోలుకున్నారని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వారు అన్నారు. సెప్టెంబరు 28న లతా 90 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఇప్పటివరకు పలు భాషల్లో దాదాపు 1000కి పైగా పాటలు పాడారు. 2001లో భారతరత్న అవార్డును సొంతం చేసుకున్నారు. లతా మంగేష్కర్.. చివరగా మార్చి 30న విడుదలైన ‘సౌగంధ్ ముజే ఇస్ మిట్టీ కీ’ అనే పాట పాడారు. ఆమె 75 ఏళ్ల వయసులో.. 2004లో ‘వీర్-జారా’ ఆల్బమ్​ ఆలపించారు. 1942లో ప్లేబాక్ సింగర్​గా మొదలైన లతా మంగేష్కర్ ప్రయాణం.. ఇప్పటివరకు ఎన్నో మధురమైన గీతాల్ని ఆలపించారు. 1989లో ప్రఖ్యాత దాదా సాహెబ్​ ఫాల్కే అవార్డును సొంతం చేసుకున్నారు.

Related posts

గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నారా?

Satyam NEWS

రాజన్న సిరిసిల్ల జిల్లాలో టిఫిన్ బాక్స్ బాంబ్ కలకలం

Satyam NEWS

కేంద్ర సొమ్ము దోచుకుతింటున్న వైకాపా నేతలు

Satyam NEWS

Leave a Comment