Slider హైదరాబాద్

కాంట్రవర్సీ: ట్రాఫిక్ పోలీసులతో సిఎం మేనల్లుడి(?) రభస

neredmet

ఇతను ఎవరో తెలుసా? మనకెలా తెలుస్తాడు. ఈయన తెలంగాణ సిఎం కేసీఆర్ మేనల్లుడు. పేరేమిటో తెలియదు కానీ పోలీసుల అంతు చూస్తానని బెదిరిస్తున్నాడు. పాపం పోలీసులు బిక్క మొహం వేసుకుని చూస్తున్నారు. నిజంగా సీఎం మేనల్లుడేమో తమ ఉద్యోగాలు ఉంటాయా ఊడతాయా అని ఒక్క నిమిషం ఆలోచించారు. ఉద్యోగం ఊడితే ఊడింది కానీ డ్యూటీ మాత్రం కచ్చితంగా చేద్దాం అని ఒక నిర్ణయానికి వచ్చిన పోలీసులు అతడిని మాత్రం కదలనివ్వలేదు. ఈ కథ నేరేడ్ మెట్ చౌరాస్తాలో జరిగింది. వాహనాల తనిఖీలో భాగంగా పోలీసులు ఒక క్యాబ్ ను నిలిపారు.

పత్రాలు చూపించమన్నారు. పోలీసులు అడిగిన పత్రాలు చూపించకుండా ఆ క్యాబ్ లోని ప్రయాణీకుడు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. తాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ మేనల్లుడినని చెబుతున్నాడు. కోర్టుకు వెళ్లినా తానే గెలుస్తానని న్యాయం తన పక్షాన ఉందని అంటున్నాడు తప్ప పోలీసులకు పత్రాలు చూపించడం లేదు. ముఖ్యమంత్రి భార్య మేనల్లుడు అయితే అయ్యాడు కానీ పత్రాలు చూపించమని అడుగుతున్నారు పోలీసులు.

Related posts

ఎక్కడికి రమ్మంటావో చెప్పు

mamatha

సామాజిక బాధ్యత నిర్వర్తించడంలో లయన్స్ సేవలు అద్వితీయం

Satyam NEWS

తెలంగాణ ఆత్మగౌరవానికి ప్ర‌తీక కెవీ రంగారెడ్డి

Sub Editor

Leave a Comment