28.2 C
Hyderabad
May 8, 2024 23: 14 PM
Slider మహబూబ్ నగర్

ఐపీఓకు వ్యతిరేకంగా ఎల్ఐసి ఏజెంట్ల ధర్నా

#LIC

ఎల్ ఐ సి లో IPO కు  వ్యతిరేకంగా  కల్వకుర్తి భారతీయ జీవిత  బీమా సంస్థలో  జీవిత బీమా సంస్థ ఏజెంట్లు ధర్నా నిర్వహించారు. ఉదయం 10 గంటలనుండి లియాఫి ఆధ్వర్యంలో ఎల్ఐసి కార్యాలయంలో ఎటువంటి కార్యాలయ కార్యకలాపాలు జరగకుండా ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆల్ ఇండియా అడ్వైజర్ కమిటీ చైర్మన్  ఎస్ బి శ్రీనివాసాచారి హాజరయ్యారు.

ఆయన మాట్లాడుతూ 1956లో  ప్రారంభమై అంచేలంచలుగా ఎదిగిన  LIC ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసి  దారుణంగ  ప్రైవేట్ సెక్టార్ కు అవకాశం ఇస్తుందని అన్నారు. 1938 ఇన్సూరెన్స్ యాక్ట్ ను సవరణ చేస్తూ గతంలో ఉన్న 49 శాతాన్ని 74 శాతంగా పెంచారాన్నరు. గతంలో  సంపాదించిన లాభంలో ఐదు శాతం కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో 90% పాలసీదారులకు బోనస్ రూపంలో పంపిణీ చేసేవారని ఇప్పుడు ఎల్ఐసి లో మారిన సవరణల ప్రకారం 10 శాతం ప్రభుత్వానికి 90% రూపంలో పాలసీదారులకు చెందే విధంగా సవరణ చేశారని అన్నారు.

దీనివల్ల పాలసీదారులకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆయన అభిప్రాయం వెలిబుచ్చారు. ఆన్లైన్ పాలసీ అమ్మకం వల్ల ఎల్ఐసినీ నమ్ముకున్న దేశ వ్యాప్తంగా 13 లక్షల మంది ఏజెంట్లకు అన్యాయం జరుగుతుంది అన్నారు. అందువల్ల ఎల్ఐసి లో ప్రైవేటు వ్యాపారస్తులకు అవకాశం ఇవ్వద్దని అంటున్నమని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా LIC ఐటి వైస్ చైర్మన్ శ్రీ రామ్, లియాఫీ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి వెంకట్ రెడ్డి, కల్వకుర్తి లియాఫి రామ్ గోపాల్ రెడ్డి, శ్రీనివాసులు,  అల్వాల్ రెడ్డి ,దస్తగిరి, నారాయణరెడ్డి,  సత్యనారాయణ ,కల్వ ఆంజనేయులు ,కృష్ణయ్య ,సురేష్, భాస్కర్ ,నరసింహ గౌడ్, మనోహర్,  కృష్ణయ్య,  సుధాకర్, శ్రీనివాసులు, పర్వతాలు గౌడ్, గోపాల్ గుప్తా, నిరంజన్, వెంకటయ్య, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

రూ. 29 కోట్ల ఖరీదు చేసే బంగారం, డ్రగ్స్‌ పట్టివేత

Sub Editor

అక్రమంగా ఒక్క చుక్క తరలించినా ఊరుకునేది లేదు

Satyam NEWS

రైతు వ్యతిరేక బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలి

Satyam NEWS

Leave a Comment