29.7 C
Hyderabad
April 29, 2024 09: 53 AM
Slider ఆదిలాబాద్

సామాజిక బాధ్యత నిర్వర్తించడంలో లయన్స్ సేవలు అద్వితీయం

#Lions Club Kagajnagar

సామాజిక బాధ్యత నిర్వర్తించడం లో లయన్స్ క్లబ్ సేవలు ప్రశంసనీయమని కొమురం భీం జిల్లా ఏ ఎస్పీ సుధీంద్ర అన్నారు. సమాజానికి ఉపయోగపడే పనులు నిర్వహిస్తూ లయన్స్ క్లబ్ విశేష కృషి చేస్తున్నదని ఆయన అన్నారు. కాగజ్ నగర్ పట్టణంలోని రాజీవ్ గాంధి చౌరస్తాలో లయన్స్ క్లబ్ ఆఫ్ కాగజ్ నగర్ కొత్త పేట ఆధ్వర్యంలో లయన్ అధ్యక్షులు హర్షవర్ధన్ జవహర్, లయన్ జోనల్ చెర్ పర్సన్ డాక్టర్ కొత్తపల్లి అనిత ప్రజలకు కరోనా వ్యాధి పట్ల అవగాహన కలిగించడానికి దేశం నుండి కరోనాను తరిమి కొట్టడం మనదే బాధ్యత అనే పోస్టర్లు ఆవిష్కరించారు.

దీనికి  ముఖ్య అతిధి గా కొమురం భీం జిల్లా ఏ ఎస్పీ సుధీంద్ర, లయన్ రీజినల్ చైర్ పర్సన్ డా.కొత్తపల్లి శ్రీనివాస్ హాజరు అయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఏ ఎస్పీ మాట్లాడుతూ సమాజానికి, ప్రజలకు ఉపయోగపడే విధంగా లయన్స్ క్లబ్ సేవలు ఆదర్శనీయమని తెలిపారు.

లయన్ రీజినల్ చెర్ పర్సన్ డా.కొత్తపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలందరూ సామాజిక దూరం పాటిస్తూ పరిశుభ్రత పాటించాలని మస్కులు తప్పనిసరిగా ధరించాలని అన్నారు. అప్పుడే దేశం నుంచి కరోనాను పారద్రోలగలమని అన్నారు. అనంతరం పోస్టర్లు ఆవిష్కరించి మస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్ కార్యదర్శి రోచక్ అగ్రవల్, లయన్ కోశాధికారి మాచర్ల శ్రీనివాస్, లయన్ డా.విద్యాసాగర్, అశోక్ లోయ, మరియు లయన్స్ సభ్యులు పాల్గొన్నారు.

Related posts

పోలీసులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

Satyam NEWS

కొల్లాపూర్ టీఎన్జీవో యూనిట్ సభ్యులను కొనియాడిన ఎమ్మెల్యే బీరం

Satyam NEWS

27, 28 తేదీలలో జూమ్ ద్వారా తెలుగుదేశం పార్టీ “మహానాడు”

Satyam NEWS

Leave a Comment