కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని వాజిద్నగర్ గ్రామంలో ఆరెల్లి మైసమ్మ పండుగ ఉత్సవాలలో భాగంగా శనివారం కుస్తీ పోటీలు జరిగాయి. ఈ కుస్తీ పోటీలు ప్రతి సంవత్సరం ఆరెల్లి మైసమ్మ పండుగ ఉత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు జరిగే జాతర ఉత్సవాలలో ఉంటాయి.
మొదటి రోజు ఎడ్లబండ్ల ఊరేగింపు రెండవ రోజు కుస్తీ పోటీలు మూడవ రోజు ఎడ్ల బండ్ల ఊరేగింపులు కొనసాగుతాయి. దీంతో గ్రామంలో పండుగ ఉత్సవం సందడి నెలకొంది. ప్రతి ఇల్లు బంధువులతో కళకళలాడతాయి. మహారాష్ట్ర కర్నాటక సరిహద్దు ప్రాంతాల నుండి మల్లయోధులు ఈ కుస్తీ పోటీల్లో పాల్గొన్నారు.
ఆఖరి కుస్తీ పదకొండు తులాల వెండిని స్థానికులు గ్రామ సర్పంచ్ విజేతలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనుయ, ఎంపీటీసీ బండ కింది సాయిలు, ఉపసర్పంచ్ భద్రి సాయిలు, గ్రామ పెద్దలు గోపాల్ రెడ్డి, లక్ష్మీనారాయణ గ్రామస్తులు పాల్గొన్నారు.