36.2 C
Hyderabad
April 27, 2024 22: 09 PM
Slider ప్రత్యేకం

వామ్మో ఇదేం లెక్క? మత్తు దిగాల్సిందే

#Wines Shop

మద్యం వ్యాపారం ఎలా చేయాలో ఇతర రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ను చూసి తెలుసుకోవాల్సిందే. డిమాండ్ సప్లై సిద్దాంతం ప్రకారం డిమాండ్ ఎంత ఎక్కువ ఉంటే సప్లై అంత ఎక్కువ చేయడం కాదురా బాబూ డిమాండ్ ఎంత ఎక్కువ అయితే అంత రేటు పెంచాలి. తెలిసిందా?

ఆంధ్రప్రదేశ్ లో మందు అమ్మకాలకు గేట్లు ఎత్తిన అధికారులు మందు రేట్లను 25 శాతం పెంచిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రేట్లను చూసిన ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 75 శాతం పెంచేసింది. ఈ రెండు రాష్ట్రాలలో మద్యం షాపులు రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తుంటుంది. నేటి మధ్యాహ్నం నుంచి ఆంధ్రప్రదేశ్ మరో 50 శాతం రేట్లను పెంచేసింది.

అన్ని బ్రాండ్లపై మొత్తం 75 శాతం రేటును పెంచేసినట్లు అందరూ అనుకున్నారు. అయితే అది కాదు లెక్క. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ దుకాణాల ద్వారా అమ్మకాలు సాగించడం అంటే ప్రభుత్వం వ్యాపారం చేయడమేననే విషయాన్ని పక్కన పెడితే ప్రభుత్వం మందు బాబులకు నెత్తిన బండ వేసింది.

ఉదాహరణకు వెయ్యి రూపాయల బాటిల్ ఉందనుకుందాం. దాన్ని మద్యం దుకాణాలు తెరిచే సమయానికి 1250 రూపాయలకు అమ్మింది. అయితే విపరీతంగా క్యూ లైన్లు ఉండటం, మందు విపరీతంగా అమ్ముడు పోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది.

డిమాండ్ ఉన్నప్పుడే ఖజానా సర్దుకోవాలనుకున్న ప్రభుత్వం మరో 50 శాతం పెంచింది. అంటే వెయ్యి రూపాయల ధర ఉన్న బాటిల్ ధర 1750 రూపాయలు కావాలి కదా. అలా కాదు దీనికో లెక్కుంది. ఈ 50 శాతం పెంపుదల అప్పటికే ఉన్న రేటు పైన. అంటే వెయ్యి రూపాయల బాటిల్ ను 1250 చేశారు కదా, దానిపై 50 శాతం అంటే వెయ్యి రూపాయల బాటిల్ ధర 1875 రూపాయలు అవుతుంది.

అంటే 1750 కి అమ్మాల్సింది 1875కు అమ్ముతున్నారు. ఆహా ఏం బిజినెస్? ప్రభుత్వం జారీ చేసిన జీవోలో ఎంఆర్ పి 120 ఉన్న 60 లేదా 90 ఎంఎల్ పై 20 రూపాయలు, 180 ఎంఎల్ పై 40 రూపాయలు, 375 ఎంఎల్ పై 80 రూపాయలు ఇలా పెంచుకోవచ్చునని ఫిక్స్ చేశారు.  రెండో క్యాటగిరీ గా ఎంఆర్ పి రూ.120 నుంచి రూ.150, మూడో క్యాటగిరీ ఎంఆర్ పి రూ.150 కన్నా ఎక్కువ అంటూ మూడు క్యాటగిరిలు చేశారు. మూడు క్యాటగిరీలకు క్వార్టర్, ఆఫ్, ఫుల్ కు సపరేట్ రేట్లు పెట్టారు. అయితే ఇన్ని లెక్కలు ఎవరు వేస్తాడు? దుకాణంలో ఉన్నవాళ్లు ఏ రేటు చెబితే అదే.

Related posts

పెద్దమందడి పోలీసులపై హైకోర్టుకు ఫిర్యాదు

Satyam NEWS

కరడుగట్టిన “కాశ్మీర్ క్రిమినల్స్” త్వరలో వచ్చేస్తున్నారు

Satyam NEWS

శ్రీకాకుళం జిల్లా కు అన్యాయం జరగబోతోంది పారా హుషార్

Satyam NEWS

Leave a Comment