33.7 C
Hyderabad
April 29, 2024 02: 04 AM
Slider మహబూబ్ నగర్

మద్యం షాపులు తనిఖీ చేయాలి

#liquor stores

వనపర్తి జిల్లాలో బుధవారం పోలీసులు వాహనాలు తనిఖీ చేసి మద్యం, లక్షలాది రూపాయలు నగదు పట్టుకున్న విదంగా మద్యం షాపులు తనిఖీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. అసెంబ్లీ, మునిసిపల్, పంచాయతీ ఎన్నికల్లో గెలవడానికి మద్యం(లిక్కర్), డబ్బులు పంపిణి చేయడం సాంప్రదాయంగా మారింది. అన్ని శాఖల అధికారులు ఐక్యంగా, రహస్యం పాటించి ప్రజల్లో నమ్మకం కలిగిస్తే వనపర్తి జిల్లాలో భారీగా మద్యం, నగదు రూపాయలు పట్టుబడే అవకాశం ఉంది. వాహనాల తనిఖీతో పాటు మద్యం షాపులు, గ్రామాల్లో, పట్టణాల్లో బెల్టు షాపులు తనిఖీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. వైన్ షాపుల వారు తీసుకున్న మద్యం స్థాక్, అమ్మకాలు, ముందు, తర్వాత స్టాక్ వివరాలు, కడుకుంట్ల ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ మద్యం గోదామును తనిఖీ చేసి, డిస్టలరి, మద్యం కంపెనీల నుండి గోదాముకు వచ్చిన మద్యం వివరాలు పరిశీలన చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఎన్నికల పేరుతో మద్యం ఏరులై పారే అవకాశం ఉంది.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

చంద్రగ్రహణం కారణంగా టిటిడి స్థానిక ఆలయాల మూత

Bhavani

పూలు చల్లటం కాదు పూట గడిచేలా చూడాలి

Satyam NEWS

అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రులు హరీష్, పువ్వాడ

Satyam NEWS

Leave a Comment