38.2 C
Hyderabad
May 3, 2024 20: 12 PM
Slider ప్రత్యేకం

విశ్లేషణ: ప్రధాని చెప్పేది విందాం అదే పాటిద్దాం

Modi

(సత్యం న్యూస్ ప్రత్యేకం)

రేపు ఉదయం 10 గంటలకు భారత ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ప్రమాదకర పరిస్థితుల నేపధ్యంలో మోదీ ప్రకటన ఎలా ఉంటుంది అనేది సర్వత్రా ఆసక్తి రేకిస్తోంది. జాతి ఆరోగ్యం ,దేశ ఆర్థిక వ్యవస్థ రెండింటిని సమన్వయం చేస్తూ విధివిధానాలు రూపొందించినట్లు తెలుస్తోంది.

ప్రజారోగ్యం మెరుగుపడటానికి ఆర్థిక తోడ్పాటు అవసరాన్ని గుర్తించి రాష్ట్రాలకు ఇతోధిక సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు సమాచారం. లాక్డవున్ కారణంగా  కోల్పోయి న సుమారు 60 లక్షలకోట్ల ఆదాయం పూడ్చు కోవడానికి కనీసం 2 లేదా 3 ఏళ్లు  పట్ట వచ్చని ఆర్ధిక నిపుణుల అంచనా.

ఆర్థిక సహకారం తో పాటు రాయితీలతో కూడిన వెసులుబాటు కల్పించాలని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల  ఆదాయం ఒక్కసారిగా పతనం కావడం ఒకవైపు, కరోనా వైరస్ వ్యాధి నియంత్రణ కు అంచనాకు అందని వ్యయం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వాలు నిధుల లేమి తో కుదేలవుతున్నాయి.

ఆదాయ మార్గాలు మూసుకుపోయిన నేపథ్యంలో రాష్ట్రాల ఖజానా లు నిండుకున్నాయి. కేంద్ర ప్రభత్వం విడుదల చేయాల్సిన ఎంపి ల్యాండ్స్ కు గండిపడటంతో రాష్ట్ర ప్రభుత్వాలు మరింత ఇరకాటంలో పడ్డాయి. తాజగా జరిగిన  ప్రధానమంత్రి – ముఖ్యమంత్రుల వీడియో కాన్ ఫరెన్సు లో రాష్ట్రాల అభ్యర్ధనలను మోదీ కి వివరించారు.

లాక్డౌన్ పొడిగించాలని అప్పటికే మహారాష్ట్ర, ఒరిస్సా,తెలంగాణ వంటి రాష్ట్రాలు బలంగా చెప్పాయి. కేంద్రం  ఇచ్చే ఆదేశా లకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు నడిస్తే నే ఉభయతారకంగా మేలని బీజేపీ పాలిత రాష్ట్రాలు తెలిపాయి. దిల్లి, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఈశాన్య రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వనరులు, వ్యాధి గుర్తింపు సాధనాలు  ఇచ్చి సహకరించాలాని ప్రధాని ని కోరాయి.

ప్రధాని ముందు చూపు తో పూర్తి స్థాయిలో లాక్డవున్ ప్రకటించి, దేశాన్ని అప్రమత్తం చేసి కరోనా వ్యాప్తి ని అరికట్టడం తో పెద్ద ప్రమాదమే తప్పినట్లు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాని మోదీని ప్రశంసించాయి. ప్రధాని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రులు శ క్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు కితాబిచ్చారు.

వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, పారిశుద్ద్య సిబ్బంది, పోలీసులను మరోసారి కృతజ్ఞతలతో అభినందించారు. ముఖ్యమంత్రుల అభిప్రాయాలు విన్న ప్రధాని ఆర్థిక మంత్రిత్వ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ ,ఇతర సంబంధిత రంగాల నిపుణుల తో అంశాలవారీ సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే దేశ వ్యాప్తంగా  గుర్తించిన మూడు ప్రమాద కర జోన్లకు తగిన విధంగా విధివిధానాలు ఖరారు చేస్తూ , ఆర్థిక వ్యవస్థ ను గాడిలో పెట్ట డానికి అనువైన వాతా వారణాన్నీ సిద్దం చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. వైరస్ ప్రభావం అంతగా లేని ప్రాంతాల్లో చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు,అసంఘటిత కార్మికుల కు చే యూత ఇచ్చే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు పని కల్పించాలని తద్వారా ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటుందని రోడ్ మ్యాప్ రచిస్తున్న సంకేతాలు అందుతున్నాయి.

ఆర్థిక వేత్త ల సూచనలు మేరకు లాకడవున్ సడలించే దిశగా పావులు కదిపే అవకాశం పుష్కలంగా ఉంది. వైరస్ వ్యాధి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు తో పాటు అతిక్రమించిన వారిపై చర్యలు కఠినంగా ఉండాలని,  చట్ట పరమైన చర్యలకు విపత్తుల చట్టం-2005 ను ప్రామాణికంగా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం  రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించనుంది.

ఇప్పటికే గుర్తించిన క్లస్టర్లను వైద్యబృందాల సాయంతో పూర్తి స్థాయి ప్రమాద రహితంగా చికిత్స విధానాలు కొనసాగించా లని ఆదేశాలిచ్చే అవకాశం ఉంది. ఒకవైపు ప్రజా రోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూనే మరోవంక ఆదాయ మార్గాలను అన్వేషించాలని సలహా ఇవ్వనుందని తెలుస్తోంది.

భౌతిక దూరాన్ని పాటిస్తూ, వ్యక్తిగత శుభ్రతతో నిర్వహించగల రంగాలను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే ఇవ్వడం సముచిత మంటున్న నిపుణుల సలహాలకు ఆమోదించే అవకాశం క నిపిస్తోంది. ఏది ఏమైనా కుంటు పడిన ఆర్ధిక వ్యవస్థను బాగుపర్చుకునే వెసులుబాటు ను రాష్ట్ర ప్రభుత్వాలు స్వీ కరిస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయనేది నిర్వివాదాంశం.

కానీ, సురక్షిత మైన వ్యాధి నిర్ధారణ పరికరాలు, సం బంధిత చికిత్స కు అ వసరమైన మందులు సరఫరా విషయంలో కేంద్రం ఉదారంగా వ్యవహరించాలి. ఎప్పటి కప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను తగిన సలహాలు, సూచనలు,అ వసరమైతే కఠిన ఆదేశాలు జా రీ చేస్తు సమాఖ్య లక్షణాలను గౌరవించాలి.

భిన్న రాష్ట్రాలలో నెలకున్న పరిస్థితులు, స్థానిక సమస్యలపై అవగాహన తో కార్యా చరణ ఆరంభిస్తే అన్ని ప్రాంతాలలో  కరోనా సమస్యను అధి గమించవ్చచ్చంటున్న వివిధ రంగాల నిపుణుల  అభిప్రాయం నిజమే కావచ్చు. విశాల భారత దేశ 140 కోట్ల పైచిలుకు ప్రజల ఆరోగ్య సంక్షేమంకోసం ప్రధాని మోదీ బృందం తీ సుకునే నిర్ణయానికి కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ఐక్య ఆమోదం  తధ్యం.

రానున్న కొద్ది రోజులు ప్రజలు కష్ట నష్టాలకు ఓర్చుకుంటే ఈ గండం నుంచి గట్టెక్కడం ఖాయం..ఆ దిశగా పయనిద్దాం…మన దేశ ఖ్యాతిని సమున్నతంగా నిలబెడదాం…

కృష్ణారావు (ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశ్రాంత ఉన్నతాధికారి)

Related posts

అధికారులు మానవతా దృక్పథంతో సుపరిపాలన అందించాలి

Bhavani

2024లో మోడీనే మూడోసారి ప్రధాని.. అమిత్ షా

Sub Editor

క‌రోనా స‌మ‌యంలో శ్ర‌మించి సేవ‌లందించిన వారికి రేంజ్ డీఐజీ చిరు స‌త్కారం…!

Satyam NEWS

Leave a Comment