26.7 C
Hyderabad
May 3, 2024 10: 20 AM
Slider ప్రత్యేకం

హై టెన్షన్: స్థానిక సంస్థల నిధులు రాకపోతే ఎలా?

jagan 02

స్థానిక సంస్థల్లో 50 శాతం మించి రిజర్వేషన్లు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవోను రాష్ట్ర హైకోర్టు సస్పెండ్ చేసింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో 59 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఇచ్చిన విషయం తెలిసిందే.

రిజర్వేషన్లు మళ్లీ ఖరారు చేసి ఈ నెలాఖరు లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ ఈ నెలాఖరు లోపు స్థానిక ఎన్నికలు పూర్తి కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 14 ఆర్ధిక సంఘం నుంచి రావాలిసిన నిధులకు బ్రేక్ పడే అవకాశం ఉండటంతో ప్రభుత్వంలో టెన్షన్ నెలకొంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్ధిక పరిస్థితి దినదినగండంగానే నడుస్తుంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే 14 ఆర్ధిక సంఘం విడుదల చేసే 3 వేలకోట్ల రూపాయలకు పైబడి నిధులు వెనక్కి వెళ్లిపోయే అవకాశం ఉండటంతో ఏపీ ప్రభుత్వం లో టెన్షన్ నెలకొంది.

Related posts

హుజురాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు మత్స్య సంఘం మద్దతు

Satyam NEWS

ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి

Satyam NEWS

మరణాలపై అబద్ధాలు చెప్పిన దుష్ట చైనా

Satyam NEWS

Leave a Comment