38.2 C
Hyderabad
April 29, 2024 13: 16 PM
Slider నిజామాబాద్

బిచ్ కుంద లోక్ అదాలత్ లో 79 కేసుల పరిష్కారం

#lokadalat

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని కోర్టు ఆవరణలో  శనివారం నిర్వహించిన లోక్ అదాలత్ లో న్యాయమూర్తి ఉమామహేశ్వరి 79  కేసులను పరిష్కరించారు.

క్రిమినల్ కేసులు 20 పరిష్కరించ గా కోవిడ్ సమయంలో మాస్కులు ధరించని 27 మందిపై కేసులు నమోదు కావడంతో వారికి ఫైన్ విధించారు. బ్యాంకుల ద్వారా 31 మందిపై కేసు నమోదు కావడంతో 11,77,900  రూపాయల సెటిల్మెంట్ చేశారు.

అనంతరం న్యాయమూర్తి ఉమామహేశ్వరి మాట్లాడుతూ చిన్న చిన్న విషయాలకు కక్ష సాధింపులకు పోకుండా ఒకరిపై ఒకరు కేసులు తీసుకోకుండా కోర్టుల చుట్టూ తిరిగి తమ అమూల్యమైన సమయంతో పాటు డబ్బులు వృధా చేసుకోవద్దని ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి కోవిడ్ నుండి రక్షణ పొందాలని ఈ సందర్భంగా న్యాయమూర్తి అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏపీపీ రహీమొద్దీన్, లోక్ అదాలత్ బేంచ్ నెంబర్ విట్టల్ రావు, బార్ అసోసియేషన్ సభ్యులు మల్లేష్, లక్ష్మణరావు, న్యాయవాదులు ఉన్నారు. జి.లాలయ్య,  సత్యం  న్యూస్  రిపోర్టర్ జుక్కల్

Related posts

విజయసాయి ట్వీట్ పై నిప్పులు చెరగిన కామినేని

Satyam NEWS

కవితను మళ్లీ విచారించనున్న ఈడీ అధికారులు

Satyam NEWS

అక్కినేని జీవన సాఫల్య అవార్డుకు జర్నలిస్టు భగీరథ ఎంపిక

Satyam NEWS

Leave a Comment