21.2 C
Hyderabad
December 11, 2024 22: 10 PM
Slider తెలంగాణ

29 నుంచి బాసరలో శరన్నవరాత్రులు ఆరంభం

basara indra

ఈ నెల 29 నుంచి ప్రారంభ‌మ‌య్యే బాస‌ర జ్ఞాన‌స‌ర‌స్వ‌తి అమ్మ‌వారి శ‌ర‌న్న‌వ‌రాత్రుల బ్ర‌హ్మోత్స‌వాల‌కు రావాల‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఎన్. ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిని ఆల‌య‌ కార్య‌నిర్వ‌హ‌ణాధికారి, దేవ‌స్థానం క‌మిటీ స‌భ్యులు, ఆల‌య పూజారులు ఆహ్వానించారు. మంగ‌ళ‌వారం  శాస్త్రిన‌గ‌ర్ లోని మంత్రి నివాసంలో ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిని క‌లిసి ఆహ్వాన ప‌త్రిక‌ను అంద‌జేశారు. బాస‌ర స‌ర‌స్వ‌తి  అమ్మ‌వారి ఆల‌య వేద పండితులు, అర్చ‌కులు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిని ఈ సందర్భంగా ఆశీర్వ‌దించారు. అమ్మ‌వారి ప్ర‌సాదాన్ని మంత్రికి అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య కార్య‌నిర్వ‌హ‌ణాధికారి వినోద్,  ఆల‌య చైర్మ‌న్ శ‌ర‌త్ పాఠ‌క్, అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ విజ‌య రామ‌రావు, ప్ర‌ధాన అర్చ‌కులు సంజీవ్ కుమార్, వేద పండితులు నంద‌కుమార్ శ‌ర్మ‌,త‌దిత‌రులు ఉన్నారు

Related posts

ఏపిలో స్వేచ్ఛ కోసం రోడ్డెక్కబోతున్న మీడియా

Satyam NEWS

లాఠీ పట్టాల్సిన ఖాకీల చేతులు.. మానవత్వాన్ని పట్టుకున్నాయి..!

Satyam NEWS

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలల్లో భక్తుల కోసం తలంబ్రాలు

Satyam NEWS

Leave a Comment