26.7 C
Hyderabad
May 3, 2024 09: 10 AM
Slider వరంగల్

పేదలపై ఎల్ ఆర్ ఎస్ పేరుతో భారం మోపొద్దు

#CPMMaripeda

బడుగు బలహీన వర్గాల పేదలపై ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ ఆర్ ఎస్) పేరుతో భారం వెయ్యొద్దు అని సిపిఎం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కార్యదర్శి బాణాల రాజన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బుధవారం రోజున సిపిఎం ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముందు, గుండెపూడి రాంపురం గ్రామాలలో ఎల్ ఆర్ ఎస్ ను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం బాణాల రాజన్న మాట్లాడుతూ కాయకష్టం చేసి కూడబెట్టి పేదలు ప్లాట్లు కొనుగోలు చేస్తే క్రమబద్ధీకరణ పేరుతో ప్లాట్ ధరకంటే ఎక్కువ వసూలు చేస్తున్నారని అన్నారు.

 తెలంగాణ వస్తే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పిన టిఆర్ఎస్ నేడు ప్రజలపై అనేక భారాలు మోపుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తుంగలో తొక్కిందని అన్నారు.

డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితులకు 3 ఎకరాల భూమి, చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు, నిరుద్యోగులకు భృతి, ప్రతి జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలు ఇలా ఎన్నో వాగ్దానాలు చేసి వాటిని అమలు చేయడం లేదని అన్నారు.

 ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు భయ్యా వెంకన్న, తాటికొండ అనంత చారి, పుల్లూరు దేవయ్య, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కారంపూడి, ములక్కాయ దొంతు సోమన్న, పాల్వాయి రామన్న పాల్గొన్నారు.

ఇంకా రైతు సంఘం మండల నాయకులు యామిని పుల్లయ్య, రేఖ శ్రీనివాస్, అలీ, శ్రీనివాసరెడ్డి, గంధసిరి పుల్లయ్య, డివైఎఫ్ఐ మండల కన్వీనర్ కందాల రమేష్, డివైఎఫ్ఐ నాయకులు షేక్ షరీఫ్, జి మహేష్, కెవిపిఎస్ మండల కార్యదర్శి బాణాల ఎల్లయ్య, వడ్లకొండ ఉప్పలయ్య, తిరుమల, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రశ్నించే గొంతుకను విమర్శిస్తే ఊరుకునేది లేదు..

Satyam NEWS

నెహ్రూ జూలాజిక‌ల్ పార్క్ వెబ్ సైట్ ఆవిష్క‌రించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

Satyam NEWS

విద్యా వాలంటర్ లని వెంటనే పున:నియామకం చేయాలి

Satyam NEWS

Leave a Comment