26.7 C
Hyderabad
April 27, 2024 07: 30 AM
Slider మెదక్

మా గ్రామాల్ని తెలంగాణ రాష్ట్రం లో కలపండి

#Minister Harishrao

మా గ్రామాలు తెలంగాణ రాష్ట్రం లో కలపండి.. మాకు మీ సంక్షేమ పథకాలు  వర్తించేలా చూడండి అని గురువారం నాడు మహారాష్ట్ర వాసులు మంత్రి హరీష్ రావును సిద్దిపేట లో కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ డివిజన్ పరిధిలోని 42 గ్రామాల నుంచి వచ్చామని తెలిపారు.

మహారాష్ట్ర లో ఉన్నందున తమకు ఎలాంటి సౌకర్యాలు.. పథకాలు లేవని వారు అన్నారు. తెలంగాణ లో సీఎం కేసీఆర్ నాయకత్వం తెలంగాణ లో అద్భుతమైన సంక్షేమ  పథకాలు అమలు చేస్తున్నారని వారన్నారు.

కల్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్, రైతు బంధు, ఆసరా పింఛన్లు ఇలా ఎన్నో పథకాలు ప్రజలకు అందిస్తున్నారు. మమ్మల్ని కూడా తెలంగాణ రాష్ట్రం లో కలపాలి..ఆ పథకాలు మాకు వర్తింప జేయాలి అని వారు కోరారు.

42 గ్రామాలు తీర్మానం చేసిన కాపీలను మంత్రి హరీష్ రావుకి అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని, తెలంగాణ సంక్షేమ పథకాల అమలు పట్ల మీరు చూపించిన స్పూర్తి అభినందనీయం అని మంత్రి హరీష్ రావు తెలిపారు.

సీఎం కేసీఆర్ దృష్టి కి తీసుకెళ్తనని చెప్పారు. మంత్రి హరీష్ రావును కల్సిన వారిలో రాజ్ లింగారెడ్డి , శంకర్ శెట్టి,  బాలాజీ తదితరులు ఉన్నారు.

Related posts

ట్రయల్ కోర్టు తర్వాత సుప్రీందే తుది నిర్ణయం కావాలి

Satyam NEWS

కమలం కింద మంట: మళ్లీ రేగుతున్న పెగాసస్ సెగ

Satyam NEWS

ఎన్నికల డ్యూటీపై పోలీస్ అధికారులకు శిక్షణ

Satyam NEWS

Leave a Comment