29.7 C
Hyderabad
April 29, 2024 10: 20 AM
Slider మెదక్

నేరాలలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ

mahila congress rally

మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరేళ్ల శారద నాయకత్వంలో పటాన్ చెరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో మంగళవారం పెద్ద ఎత్తున ప్రదర్శన, ధర్నా జరిగింది. ఈ సందర్బంగా మూడు డిమాండ్లతో మహిళలు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయని, దేశంలో మద్యం అమ్మకాలలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని నేరేళ్ల శారద విమర్శించారు.

మద్యం విచ్చలవిడిగా పెరగడంతోనే నేరాల సంఖ్య పెరుగుతుందని అన్నారు. తెలంగాణలో నేరాలను అదుపు చేసే యంత్రాంగం పూర్తిగా విఫలం అయ్యిందని, కేంద్ర నేరాల నమోదు వివరాల ప్రకారం దేశంలో నేరాలలో రెండో స్థానంలో తెలంగాణ ఉందని అన్నారు. రాష్ట్రంలో మద్య పాన నిషేధాన్ని అమలు చేయాలని శారద డిమాండ్ చేశారు.

అలాగే సాంకేతిక రంగం మార్పులలో భాగంగా నీలి చిత్రాల ప్రసారాలు అధికమయ్యాయని దాంతో యువత తప్పుదోవ పట్టిపోతున్నారని వాటిని నియంత్రించే అవకాశాలు లేకపోవడంతో వాటి వల్ల నేరాలు, అత్యాచారాలు పెరిపితున్నాయని విమర్శించారు. వాటిని పూర్తిగా నియంత్రించాలని అన్నారు.

దిశ హత్య కేసులో ఒక ప్రత్యేక కమిటీ వేయాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేసి దోషులకు నెల రోజులలో కఠిన శిక్షలు అమలు అయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్దఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Related posts

హోలీ సంబరాల్లో కలెక్టర్

Murali Krishna

కరోనావైరస్ కు ఉచితంగా హోమియో మందు పంపిణీ

Satyam NEWS

ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు

Bhavani

Leave a Comment