25.2 C
Hyderabad
May 8, 2024 08: 01 AM
Slider మహబూబ్ నగర్

దళితబంధు స్కీం అందరికి ఇవ్వాలి

#mala

నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండల కేంద్రంలో జరిగిన మాలల చైతన్య సమితి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాలల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మూలె కేశవులు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దెల రామదాస్, కొల్లాపూర్ మండల అధ్యక్షులు బి సురేందర్ కోడేరు గ్రామ కమిటీ నియామక పత్రం అందజేయడం జరిగింది. కోడేరు గ్రామ కమిటీ అధ్యక్షుడిగా వెలకంటి శివశంకర్ ఉపాధ్యక్షులుగా ఈ మహేష్ ప్రధాన కార్యదర్శిగా మహేందర్ కోశాధికారిగా మహేష్ సహాయ కార్యదర్శిగా వెంకటేష్ ప్రచార కార్యదర్శిగా మహేందర్ కోఆర్డినేటర్ గా విష్ణు కార్యనిర్హక కార్యదర్శిగా మహేష్ అధికార ప్రతినిధిగా మైబు స్వామి గౌరవ సలహాదారులుగా మహేశ్వర్ మునిస్వామి గౌరవ అధ్యక్షునిగా వేముల మల్లేష్ తో పాటు 5 మంది కార్యవర్గ సభ్యులతోపాటు కమిటీ ఎన్నుకోవడం జరిగింది.

మూలె కేశవులు రాందాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడెకరాల భూమి డబల్ బెడ్ రూమ్ లో దళిత బంధు స్కీం దళితులకు సమానంగా ప్రతి ఇంటికి అమలు చేసి దళిత కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి బాటలు వేయాలని మాలల చైతన్య సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలైన అనగారిన వర్గాల కు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించడం వల్లనే ఆర్థికంగా అభివృద్ధి చెందారు ఈ దేశంలో ఉన్న దళిత బహుజనుల జీవితాల్లో వెలుగు నింపిన నిండు జగతి సూర్యుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని ఈనెల ఆఖరి వరకు గొప్ప పండుగగా జరుపుకోవాలని మాలల చైతన్య సమితి నూతనంగా ఎన్నుకోబడిన కోడేరు గ్రామ కమిటీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు శివ శంకర్ మహేందర్ లు ఈ సందర్భంగా కోరారు

Related posts

పైడితల్లి సిరిమానోత్సవానికి పటిష్ట బందోబస్తు

Satyam NEWS

రాష్ట్రంలో పైశాచిక పాలన సాగుతోంది

Bhavani

మునిసిపల్ సిబ్బందికి ఆర్ఎంపిల సహకారం

Satyam NEWS

Leave a Comment