30.7 C
Hyderabad
April 29, 2024 06: 01 AM
Slider విజయనగరం

పైడితల్లి సిరిమానోత్సవానికి పటిష్ట బందోబస్తు

#vijayanagarampolice

12 మంది డీఎస్పీలు…63 మంది సీఐలు…166 మంది ఎస్ఐ లు…11 మంది మహిళా ఎస్ఐలతో…

సరిగ్గా రెండేళ్ల తర్వాత… ఏపీలో ని విజయనగరం జిల్లాలో కేంద్రం లో శ్రీశ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం జరగబోతోంది. ఈ నెల 10,11 తేదీలలో ఉత్తరాంధ్ర కల్పవల్లి, విజయనగరం ఇలవేల్పు శ్రీపైడితల్లి సిరిమానోత్సవం జరగనుంది. ఇందుకోసం పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తోంది పోలీస్ శాఖ. ఇప్పటికే ఎస్పీ దీపికా… నగరంలో ని పైడితల్లి సిరిమాను తిరిగి ప్రదేశాన్ని..పూజారి ఉంటున్న హుకుంపేటను పరిశీలించారు.

ఈ క్రమంలో సిరిమానోత్సవం కు ఎంతమంది బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నది..మీడియా సమావేశం పెట్టి మరీ తెలియజేసారు..పోలీసు బాస్ దీపికా. మొత్తం 22 సెక్టార్లుగా విభజించి… దాదాపు 3 వేల మంది సిబ్బంది తో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలియ జేసారు.విజయనగరం లో ఈ నెల 10, 11 తేదీల్లో జరగబోవు శ్రీ పైడితల్లమ్మ సిరిమానోత్సవానికి పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సిరిమానోత్సవాన్ని శాంతియుతంగా నిర్వహించేందుకు బందోబస్తును 22 సెక్టార్లుగా విభజించి, సుమారు 3000 మంది పోలీసులను రెండు షిఫ్టులు గా విధులు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. బందోబస్తులో ఎస్పీ, అదనపు ఎస్పీ, 12 మంది డిఎస్పీలు, 63 మంది సిఐలు,ఆర్ఎస్ఐలు, 166 మంది ఎస్ఐలు,ఆర్ఎస్ఐలు, 11 మంది మహిళా ఎస్ఐలు మరియు స్పెషల్ పార్టీ సిబ్బందితో సహా సుమారు 3000 మంది పోలీసు అధికారులను, సిబ్బందిని బందోబస్తు నిమిత్తం వినియోగిస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు.

మొత్తం బందోబస్తును, కమాండ్ కంట్రోల్ పర్యవేక్షించేందుకు పోలీసు అధికారులను నియమించామన్నారు. ఈ బందోబస్తు విధుల్లో మహిళా పోలీసులను, ఎన్సిసి సిబ్బంది యొక్క సేవలను కూడా వినియోగిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. అమ్మవారి సిరిమానోత్సవ బందోబస్తు విధులను నిర్వహించేందుకు ఇతర జిల్లాల నుండి కూడా పోలీసు అధికారులు, సిబ్బంది వస్తున్నారని జిల్లాఎస్పీ ఎం. దీపిక తెలిపారు.

కమాండ్ కంట్రోల్ రూం

శ్రీ పైడితల్లమ్మ అమ్మవారి దేవాలయం ఎదురుగా తాత్కాలికంగా కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సిరిమాను తిరిగే ప్రాంతాలను, సిరిమాను తీసుకొని వచ్చే మార్గంలోను, ఇతర ముఖ్య కూడళ్ళలోను సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదే విధంగా బందోబస్తు నిర్వహించే పోలీసు సిబ్బందికి కూడా బాడీ వార్న్ కెమెరాలను ధరింపజేస్తున్నామన్నారు. భద్రతను నిరంతరం పర్యవేక్షించే విధంగా డ్రోన్ కెమెరాలు కూడా వినియోగిస్తున్నామన్నారు. ఈ కమాండ్ కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన పెద్ద టివిలకు బందోబస్తు లో పోలీసులు ధరించిన బాడీ వార్న్ కెమెరాలను, సిసి కెమెరాలను మరియు డ్రోన్ కెమెరాలను అనుసంధానం చేసి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా ఏర్పాటు చేసి, భద్రతను పర్యవేక్షిస్తామన్నారు.

రూఫ్ టాప్ లు ఏర్పాటు

సిరిమాను తిరిగే మార్గంలో ముందుగా గుర్తించిన 30 ప్రాంతాల్లో రూఫ్ టాప్ లలో పోలీసులను నియమించి, నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇక్కడ విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది బైనాక్యులర్స్ తో సిరిమాను తిరిగే ప్రాంతాలను పరిశీలిస్తూ, అవసరమైన సమాచారాన్ని కమాండ్ కంట్రోల్ రూంకు తెలియజేసి, పోలీసులను అప్రమత్తం చేస్తారన్నారు.

నేరాల నియంత్రణకు ప్రత్యేక క్రైం బృందాలు

నేరాలను నియంత్రించేందుకు నేరస్థులను గుర్తించుటలో అనుభవజ్ఞులైన 200మంది క్రైం సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసామన్నారు. ఈ బృందాలు ఆలయం, రద్దీ ప్రాంతాల్లో మఫ్టీలో తిరుగుతూ జేబు దొంగతనాలు, గొలుసు దొంగతనాలు జరగకుండా చర్యలు చేపడతారన్నారు. అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించేందుకు పోలీసు జాగిలాలతోపాటు, ప్రత్యేక బాంబ్ స్క్వాడ్ బృందాలను రంగంలోకి దింపుతున్నామన్నారు. ఈ బృందాలు ఆలయాలు, బస్టాండు, రైల్వే స్టేషను మరియు ఇతర రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు చేపడతారు.

సిద్ధంగా మరో ఏడు ప్రత్యేక బృందాలు

అత్యవసర సమయాల్లో తక్షణమే స్పందించేందుకుగాను ఏడు ప్రత్యేక పోలీసు బృందాలను కమాండ్ కంట్రోల్ వద్ద సిద్ధంగా ఉంచుతున్నామన్నారు. ఈ సిబ్బంది ఎక్కడ ఏ అత్యవసర పరిస్థితి ఎదురైనా, వేరే పోలీసు సిబ్బంది కోసం వేచి చూడకుండా వీరిని వినియోగిస్తామన్నారు.

వాహనాల పార్కింగు ప్రాంతాలు

ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేకంగా పోలీసు సిబ్బందిని, అధికారులను కేటాయించి, పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణకు చర్యలు చేపడతామన్నారు. వాహనాల పార్కింగుకు అయోధ్య మైదానం, రాజీవ్ స్టేడియం, రామానాయుడు రోడ్డు, పెద్దచెరువు గట్టు, ఐ కోనేరు గట్టు, పోర్టు సిటీ స్కూల్ రోడ్డు, ఎస్విఎన్ నగర్ రోడ్డు, ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ నుండి బాలాజీ జంక్షన్ వరకూ గల రింగు రోడ్డు ప్రాంతాల్లో ప్రజలు వాహనాలను పార్కింగు చేసు కొనేందుకు స్థలాలను ఏర్పాటు చేసామన్నారు.

అదే విధంగా విఐపిల వాహనాల పార్కింగుకు బొంకులదిబ్బ, టిటిడి కల్యాణ మండపం, గురజాడ కళాకేత్రం, కోట ప్రాంతాల్లో పార్కింగు స్థలాలను ఏర్పాటు చేసామన్నారు. ప్రజలకు సూచనలు చేసేందుకు, సమాచారాన్ని అందించేందుకు వాహనాలకు పబ్లిక్ అడ్రసింగు సిస్టమ్స్న ఏర్పాటు చేసామన్నారు. సిరిమానోత్సవం రోజున (11న) వాహనాలను (పోర్ వీలర్లు) విజయనగరం పట్టణ లోపలకు అనుమతించని ప్రదేశాలు: 1) ఎంఆర్ కాలేజీ జంక్షన్, 2) కెపి టెంపుల్, 3) గంటస్థంబం 4) ట్యాక్సీ స్టాండు, 5) శివాలయం వీధి, 6) ఘోషా ఆసుపత్రి, 7)గుంమ్చి రోడ్డు, 8) సింహాచలం మేడ, 9) సత్యా లాడ్జి ప్రాంతాల వద్ద వాహనాలకు లోనికి ప్రవేశించేందుకు అనుమతి ఉండదన్నారు.

సిరిమానోత్సవం రోజున (11న) విజయనగరం పట్టణ లోపల ప్రాంతాల్లో డైవర్షన్స్ ఉంటాయి. నగరంలోని వాహనాలను  సిఎంఆర్ జంక్షన్, గూడ్సు షెడ్ మీదుగా నగరం బయటకు వెళ్ళవచ్చును. బాలాజీ జంక్షన్, రామానాయుడు రోడ్డు, సిఎంఆర్ఆంక్షన్, గూడ్సు షెడ్ మీదుగా పట్టణం వెలుపలకు వెళ్ళవచ్చును. ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, బాలాజీ జంక్షన్, ఆర్టీసి కాంప్లెక్స్, ఎత్తుబ్రిడ్జి మీదుగా పట్టణం వెలుపులకు వెళ్ళవచ్చును.

కొత్తపేట జంక్షన్, దాసన్నపేట, ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, ధర్మపురి రోడ్డు మీదుగా నగరం వెలుపులకు వెళ్లేందుకు వాహనాలను అనుమతిస్తామన్నారు.

జె.ఎన్.టి.యూ., కలెక్టరాఫీసు, ఆర్ అండ్ బి జంక్షన్, ఎత్తు బ్రిడ్జ్, ప్రదీప్ నగర్ మీదుగా నగరం వెలుపులకు వాహనాలను అనుమతిస్తామన్నారు.

ప్రదీప్ నగర్ జంక్షన్, ధర్మపురి రోడ్డు, ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, దాసన్నపేట మీదుగా బయటకు అనుమతిస్తామన్నారు.

సిరిమానోత్సవం రోజు సిరిమాను తిరిగే మార్గంలో అనుసందాన రోడ్డుల వద్ద బారికేట్లు వేయడం జరుగుతుం దన్నారు. ఈ ఏడాది ఎటువంటి తోపులాటలు మరియు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలందరూ సిరిమాను తిలకించే విధంగా అనుసందాన రోడ్లులో బాక్సు సిస్టమ్ను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు.

కమ్యూనికేషన్ నగరంలో వివిధ ప్రాంతాల్లో బందోబస్తు విధులు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బందిని సమన్వయం చేసుకొనేందుకు 200 వైర్లెస్ సెట్లను వినియోగిస్తున్నామన్నారు. అదే విధంగా ప్రజలకు సూచనలు చేసేందుకు అన్ని ముఖ్య కూడళ్ళలో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్లను కూడా ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు.

పోలీసు ‘సేవాదళ్

భక్తులకు సహాయ, సహకారాలు అందించేందుకు పోలీసు సేవాదళ్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. శ్రీ పైడితల్లమ్మ సిరిమానోత్సవం బందోబస్తుకు వచ్చే మహిళా సిబ్బందికి ప్రత్యేకంగా దిశా మహిళా టాయిలెట్ లను ఏర్పాటు చేస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు.

పోలీసుశాఖకు ప్రజలంతా సహకరించాలి

శ్రీ పైడితల్లమ్మవారి పండగను భక్తి వాతావరణంలో, శాంతియుతంగా నిర్వహించేందుకు ప్రజలంతా పోలీసుశాఖకు సహకరించాలని, పోలీసులు సహాయాన్ని పొందాల్సిన వారు దేవాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన తాత్కాలిక పోలీసు కంట్రోల్ రూంకు సంప్రదించవచ్చునని, అదే విధంగా ఏదైనా సమాచారాన్ని వారికి అందించవచ్చు నని జిల్లా ఎస్పీ ఎం. దీపిక  తెలియజేశారు.

పోలీసు సిబ్బందికి సూచనలు

భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలని వారికి ఎటువంటి అసౌక్యం కలిగించకుండా చూడాలని, దురుసుగా ప్రవర్తించకూడ దన్నారు. వారికి అన్ని విధాలుగా సహాయసహకారాలు అందించాలని జిల్లా పోలీసు సిబ్బందికి తగిన సూచనలను ఇవ్వడమైనదని జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలియజేశారు. ఈ సమావేశంలో విజయనగరం సబ్ డివిజన్ ఇంచార్జ్  డిఎస్పీ టి.త్రినాధ్, ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావు, ఎస్బి.సిఐ జి.రాంబాబు, వన్ టౌన్ సిఐ బి. వెంకటరావు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గోన్నారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం జిల్లా

Related posts

కామారెడ్డిలో ఓయూ జెఎసి చైర్మన్ సత్యనారాయణ భిక్షాటన

Satyam NEWS

ఆరంజ్ ట్రావెల్స్ కు తృటిలో తప్పిన ఘోర ప్రమాదం

Satyam NEWS

బాధిత కుటుంబానికి గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ చెక్కు అందజేత

Satyam NEWS

Leave a Comment