39.2 C
Hyderabad
April 30, 2024 20: 04 PM
Slider హైదరాబాద్

మండల్ చేసిన 42 సిఫార్సులలో ఏవీ అమలుకు నోచుకోలేదు

#MinisterSrinivasGowd

కేంద్రంలో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ బిపి మండల్ చేసిన 42 సిఫారసులు ఒకటి రెండు మినహా ఏవి అమలుకు నోచుకోలేదని క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.

 మంగళవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన బిందేశ్వర్ ప్రసాద్ మండల్ (బిపి మండల్) 102వ జయంతి సందర్భంగా ఆన్లైన్ బహిరంగ సభ జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఇంతవరకు బడుగు బలహీన వర్గాలకు మార్గనిర్దేశంని అందించిన గొప్ప వ్యక్తి బిపి మండల్ అని అన్నారు. ప్రపంచం లో మూగ జీవాలకు జనాభా గణన ఉందని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జాతులకు ఏ సంఖ్యలో ఏముందో లెక్కలు ఉన్నాయి కానీ మనిషిగా పుట్టిన బీసీలకు జనగణన లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

కేంద్రంలో ఇప్పటివరకు బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ లేదంటే ఎంత విడ్డూరమో ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎందుకు ఈ వర్గాల పట్ల వివక్ష ఎందుకు దూరం పెడుతున్నారు. ఈ విషయంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు.

దేశంలో అధికారంలోకి వచ్చిన వారు ఎవరు ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చామని విషయంపై కూడా దృష్టి సారించాలన్నారు. కేంద్రంలో ప్రత్యేకంగా బీసీలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు లేకపోవడం సిగ్గుచేటని, బీసీల జనాభాకు అనుగుణంగా బడ్జెట్ లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

బీసీల రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రిజర్వేషన్లు వాళ్ళ చేతుల్లో ఎందుకు పెట్టుకున్నారో అర్థం కావడం లేదన్నారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, తెలంగాణ బీసీ కమిషన్ పూర్వ సభ్యులు డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పాల్గొన్నారు.

ఇంకా, తెలంగాణ టిడిపి అధ్యక్షుడు మాజీ మంత్రి ఎల్.రమణ, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ గణేష్ చారి, జాతీయ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు తాటికొండ విక్రం గౌడ్, తెలంగాణ రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కులకచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, కనకాల శ్యామ్, బీసీ విద్యార్థి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కోల్ నరేష్ పాల్గొన్నారు.

Related posts

బీజేపీపై త‌ల‌సాని ఫైర్‌

Sub Editor

మూడవ వసంతంలోకి అడుగుపెట్టిన హోమ్ టుడే ఫర్నిచర్

Satyam NEWS

శారదా శక్తి పీఠం సందర్శనకు ప్రయత్నాలు

Murali Krishna

Leave a Comment