35.2 C
Hyderabad
April 27, 2024 13: 31 PM
Slider ప్రత్యేకం

శారదా శక్తి పీఠం సందర్శనకు ప్రయత్నాలు

#sharada peetham

అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శారదా శక్తి పీఠం ఐదవ శతాబ్దంలో కాశ్మీర్ లో నిర్మించారు. కాశ్మీర్ పండిట్ల ఆరాధ్యదైవం శారదా పీఠం ఆలయం ఒకప్పుడు తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలకు ధీటుగా విద్యాకేంద్రంగా భాసిల్లింది. ఇక్కడ ఐదువేల మంది విద్యార్థులు చదివేవారు‌. అయితే దేశ విభజన తరువాత శారదా మాత శక్తి పీఠం పాకిస్తాన్ కు వెళ్లిపోయింది. ప్రస్తుతం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో భారత సరిహద్దుకు పది కిలోమీటర్ల దూరంలో ఉంది. పంజాబ్ నుండి  పాకిస్తాన్ లోని కర్తార్ పూర్ కారిడార్ కు భారతీయులు వీసా లేకుండా వెళ్లి గురుద్వారాను దర్శించుకునే అవకాశం కల్పించారు.  అదేవిధంగా శారదా మాత ఆలయ దర్శనానికి వీసా లేకుండా అనుమతి ఇవ్వాలని కాశ్మీర్ పండిట్లు కోరుతున్నారు. శారదా పీఠం కాశ్మీర్ నుండి 130 కిలోమీటర్ల దూరంలో, పాకిస్తాన్ లోని ముజఫరాబాద్ నుండి 150 కిలోమీటర్ల దూరంలో, .సముద్ర మట్టానికి 1981 కిలోమీటర్ల ఎత్తులో నీలం నది పక్కన ,  మౌంట్ హర్ముక్ లోయలో నెలకొని ఉంది. శారదా పీఠం సందర్శన   అనుమతికి ప్రయత్నం చేస్తున్నట్లు ఇటీవల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. వెంటనే పిఒకె అసెంబ్లీ లో ఇందుకు అనుకులంగా ని తీర్మానం చేశారు… అయితే పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం ఒప్పుకోవడం లేదు. శారదా పీఠం  పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందితే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరు ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. అందుకే శారదా పీఠానికి భారత సరిహద్దు నుండి కారిడార్ నిర్మాణం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి సఫలం కావాలని ఆశిద్దాం.

Related posts

మద్యం సిండికేట్ తో చేతులు కలిపిన సబ్ ఇన్ స్పెక్టర్

Satyam NEWS

యూజ్ అండ్ త్రో: సాలూరు రాజన్నకు జగన్ ఝలక్

Satyam NEWS

ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్‌ ఎత్తివేత

Satyam NEWS

Leave a Comment