29.7 C
Hyderabad
April 29, 2024 10: 11 AM
Slider వరంగల్

కరోనా కేసులు పెరుగుతున్నాయి జాగ్రత్త

#DMandHOMulugu

కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటికి మస్కుల లేకుండా ఎవరు కూడా రావద్దని ములుగు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య కోరారు.

మాస్క్ ఉంటేనే బయటికి రావాలని, ముఖ్యంగా గ్రామంలో ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం లేదా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా, లేదా ఏ రకమైన ఆరోగ్య సమస్యలు ఉన్న తప్పకుండా దగ్గర లోని ఆశ, ఆరోగ్య కార్యకర్త కు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.

ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా దగ్గర లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నేడు ఆయన ఏటూరునాగారం మండలం కన్నాయిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పెద్ద వెంకటాపూర్ గ్రామాన్ని సందర్శించి, ఆ గ్రామంలో ఉన్న కరోనా పాజిటివ్ కేసుల వద్దకు వెళ్లి వారి ఆరోగ్య సమాచారం, వారికి అందుతున్న ఆరోగ్య సేవల గురించి వారి ద్వారానే అడిగి తెలుసుకున్నారు.

ఇంటిలో ప్రత్యేక సౌకర్యాలు లేని వారిని గుర్తించి కొంత మందిని  ఎటురూనాగారం వై టి సి ప్రభుత్వ క్వారంటైన్ లో ఉంచాలని వైద్య అధికారికి సూచించారు. అనంతరం ఆ గ్రామంలో తానే స్వయంగా కోవిడ్ నిర్దారణ  పరీక్షలు నిర్వహించారు.

అనంతరం మంగపేట మండలంలోని కమలాపురం గ్రామాన్ని లోఉన్న కోవిడ్ పోసిటివ్ కేసుల వద్దకు వెళ్ళి వారి ఆరోగ్య పరిస్థితి లను తెలుకుని, అందు లోనూ కోవిడ్ పోసిటివ్  ఉన్న ఆరోగ్య సిబ్బంది వద్దకుడా వెళ్లి వారికి కావాల్సిన మందులను ఇచ్చారు.

DMHO వెంట DIO Dr. శ్యామసుందర్, Dr.నవీన్, Dr. మృదుల, Dr. నిఖిల్, RRT టీం మెంబెర్స్ దుర్గారావు CHO, నవీన్ రాజ్ కుమార్ డెమో,తి రుపతయ్య HE ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు పాల్గొన్నారు.

Related posts

పేకాట డెన్ లో దొరికిన కొల్లాపూర్ మాజీ, తాజా నేతల అనుచరులు

Satyam NEWS

పునాది నుంచే విద్యా వ్యవస్థ పటిష్టతకు చర్యలు

Bhavani

శాస్త్రోక్తంగా ప్రారంభమైన నమ్మాళ్వారుల అధ్యయనోత్సవాలు

Satyam NEWS

Leave a Comment