Slider ముఖ్యంశాలు

వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్ కలర్ పాస్ బుక్

#Telangana CM KCR 1

దేశంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు కలిగివున్న ప్రజలందరికీ మెరూన్ కలర్ పట్టాదార్ పాస్ బుక్స్ జారీచేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు.

ఇప్పుడు అమలులోకి తెస్తున్న విప్లవాత్మక రెవెన్యూ చట్టం ద్వారా పేద, మధ్య తరగతి సహా ప్రజలందరీ ఆస్తులకు పూర్తి స్థాయి రక్షణ కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని సిఎం పేర్కోన్నారు.

ప్రజల దీర్ఘకాలిక, విశాల ప్రయోజనాలను ఆశించి ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు సిఎం తెలిపారు. భూ వివాదాలు , ఘర్షణల నుండి ప్రజలను శాశ్వతంగా రక్షించడం కోసం వారి ఆస్తులకు పక్కా హక్కులు కల్పించడం కోసం ఈ పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నట్లు సిఎం చెప్పారు.

నేడు ప్రగతి భవన్ లో సమీక్ష

రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు అంశాలపై ప్రగతి భవన్ లో బుధవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. 

సమావేశంలో మంత్రులు కె.టి.రామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు  రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్,

ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్దన్, పెద్ది సుదర్శన్ రెడ్డి, గణేష్ బిగాల, ఆశన్నగారి జీవన్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీలు మాదిరెడ్డి శ్రీనివాస రెడ్డి, బాలసాని లక్ష్మినారాయణ,

సిఎంఒ ముఖ్యకార్యదర్శి నర్సింగ్ రావు, సెక్రటరీ స్మితా సభర్వాల్, ఓఎస్డి భూపాల్ రెడ్డి, ఎంఎయూడి ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, డైరెక్టర్ సత్యనారాయణ, పంచాయతిరాజ్ సెక్రటరీ  సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్  రఘునందన్ రావు, జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పోరేషన్ల పరిధిలోని ఇండ్లు, ప్లాట్లు, ఫ్లాట్లు,  వ్యవసాయ భూముల దగ్గర నిర్మించుకున్న బావుల కాడి ఇండ్లు, ఫామ్ హౌజ్ లు తదితర వ్యవసాయేతర ఆస్తులన్నింటినీ ఒక్క పైసా చెల్లించకుండా ఉచితంగా ఆన్ లైన్ లో ఎన్ రోల్ (మ్యూటేషన్) చేయించుకోవాలని సిఎం రాష్ట్ర ప్రజలకు విజప్తి చేశారు.

ఇకముందు ఒక ఇంచు భూమి ఒకరి పేరు నుండి మరొకరి పేరుమీదకి బదిలీ కావాలంటే ధరణి పోర్టల్ ద్వారా మాత్రమే రిజిష్ట్రేషన్ జరుగుతుందని సిఎం తెలిపారు.

అన్ని ఆస్తులూ మ్యుటేషన్ చేయించుకోండి

అందుకే వ్యవసాయేతర ఆస్తుల వివరాలు, ఆధార్ కార్డు వివరాలతో సహా కుటుంబ సభ్యుల వివరాలు పంచాయతి, మున్సిపల్ సిబ్బంది ద్వారా ఇంటి నెంబర్ తీసుకుని ఆన్ లైన్ లో వివరాలు నమోదు చేయించుకోవాలని సిఎం ప్రజలను కోరారు. 

ఇప్పుడు ఆస్తుల వివరాలను మ్యుటేషన్ చేయించుకోకపోతే భవిష్యత్తులో ఆస్తులను తమ పిల్లలకు బదిలీ చేసే విషయంలో ప్రమాదం తలెత్తే అవకాశం వుందని హెచ్చరించారు. నిరుపేద ప్రజలు ఎన్నో ఏండ్లుగా వుంటున్న ఇండ్ల స్తలాలను పూర్తి స్తాయిలో రెగ్యులరైజ్ చేయనున్నట్లు సిఎం ప్రకటించారు.

దీనివల్ల నిరుపేదల ఇంటి స్తలాలకు రక్షణ ఏర్పడడమే కాకుండా ఆ ఆస్తుల మీద బ్యాంకు రుణాలు తీసుకునే వెసులుబాటు పేదలకు కలుగుతుందని సిఎం పేర్కోన్నారు.  

ఈ ఆస్తుల మ్యుటేషన్ కు, ఎల్.ఆర్.ఎస్ కు ఏలాంటి సంబంధం లేదని, ఇండ్లు ఎలా నిర్మించారనేది పంచాయతిరాజ్, మున్సిపల్ చట్టాలకు, నిబంధనలకు లోబడే వుంటుందని సిఎం వివరించారు.

వ్యవసాయ భూముల పరిధిలోని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ పరిధిలో  నిర్మించుకున్న ఇండ్లు తదితర ఆస్తులను ఉచితంగా నాలా కన్వర్షన్ చేయనున్నట్లు సిఎం తెలిపారు. 

వ్యవసాయ భూముల వద్ద నిర్మించుకున్న ఇండ్లు తదితర ఆస్తుల విస్తీర్ణాన్ని వ్యవసాయ కేటగిరి నుంచి తొలగించే విషయంలో ప్రజలకు సర్పంచులు, ఎంపిటీసిలు, గ్రామ కార్యదర్శులు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సిబ్బంది పూర్తి స్తాయిలో సహకరించాలని సిఎం అన్నారు. ఎంపీఓలు దీన్ని పూర్తి స్తాయిలో పర్యవేక్షించాలని సూచించారు.

Related posts

త్రినాథ్ పెదిరెడ్ల ఇక లేరు

Satyam NEWS

లాక్ డౌన్ కు ఏడాది..

Satyam NEWS

పట్టుబడ్డ ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం బాటిళ్ల ధ్వంసం

Satyam NEWS

Leave a Comment