42.2 C
Hyderabad
April 30, 2024 18: 24 PM
Slider ప్రపంచం

ఆఫ్రికా పార్లమెంట్ లో భారీ అగ్ని ప్రమాదం

ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో మంటలను మరువక ముందే, తాజాగా మరో పార్లమెంట్‌ మంటల్లో చిక్కుకుంది.  దక్షిణాఫ్రికా పార్లమెంట్​లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడి పార్లమెంట్ భవనంలోని మూడో అంతస్తు సహా, నేషనల్ అసెంబ్లీ ఛాంబర్​లకు మంటలు వ్యాపించాయి.

ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, మంటలు ఆర్పారు. ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు అక్కడి అధికారులు. అయితే, ఈ ప్రమాదానికి కారణం ఏంటని ఆరా తీస్తున్నారు అధికారులు.

మొన్న ఆస్ట్రేలియా పార్లమెంట్ భవనానికి నిప్పు పెట్టారు నిరసనకారులు. క్యాన్బెరాలో ఉన్న పాత పార్లమెంట్ భవన తలుపులు ఆ మంటల్లో దగ్ధం అయ్యాయి. ఓ నిరసన ప్రదర్శనలో ఈ ఘటన జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఆస్ట్రేలియా ఘటనలో కూడా ఎవరూ గాయపడలేదు.

ఈ ఘటనను ఖండించారు ప్రధాని స్కాట్ మారిసన్. ఆస్ట్రేలియన్లు ఇలా ప్రవర్తిస్తారని అనుకోవడం లేదని, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే పార్లమెంట్ కు నిప్పు పెడుతారా అని ప్రశ్నించారు. అయితే, ఈ రెండు ప్రమాదాలపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజంగానే షార్ట్‌ సర్క్యూట్‌ జరిగితే పరిస్థితులు ఇలా ఉండవని అంటున్నారు అక్కడి అధికారులు.

అటు సౌతాఫ్రికా పార్లమెంట్ భవనంలో పలు కీలక డాక్యుమెంట్లు మంటల్లో కాలిపోయినట్టు తెలుస్తోంది. దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. ఈ ఇష్యూపై దర్యాప్తు చేస్తున్నారు అక్కడి అధికారులు. దర్యాప్తు తర్వాత ఈ అగ్నిప్రమాదం, దానికి కారణాలపై ఫుల్‌ క్లారిటీ వచ్చే ఛాన్స్‌ ఉంది.

Related posts

ధరణి అంశాల పై కలెక్టర్ లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

Satyam NEWS

ఎమ్మెల్యే బొల్లా నుండి నాకు ప్రాణహాని ఉంది ..

Satyam NEWS

నల్ల బ్యాడ్జీలతో ఎల్ ఐ సీ ఏజెంట్ల నిరసన

Satyam NEWS

Leave a Comment