42.2 C
Hyderabad
April 26, 2024 16: 17 PM
Slider అనంతపురం

కళ్యాణదుర్గంలో జగనన్న విద్యా కానుక ప్రారంభం

#KalyanadurgamMLA

ఉత్తమ విద్య ద్వారానే వ్యక్తిత్వం వికసించడం తోపాటు, ఉన్నత జీవిత లక్ష్యాలను వచ్చని,  సమాజంలో కూడా మార్పు సాధ్యమవుతుందని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ శాసన సభ్యురాలు ఉష శ్రీ చరణ్ పేర్కొన్నారు.

 కళ్యాణదుర్గం  కరణం చిక్కప్ప  ప్రభుత్వ  ఉన్నత పాఠశాల  ఆవరణలో  ఏర్పాటుచేసిన జగనన్న విద్యా కానుక  ప్రారంభోత్సవ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని, విద్యా జ్యోతిని వెలిగించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ విద్య ద్వారానే పేదరికాన్ని జయించ వచ్చని , మూఢనమ్మకాలను నిర్మూలించవచ్చని, మెరుగైన సమాజాన్ని నిర్మించ వచ్చని అన్నారు. 

డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని అద్భుతంగా రూపొందించడానికి కారణం ఆయన ఉన్నత విద్యావంతుడు అయినందునే సాధ్యమైందని అన్నారు.

అలాగే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజనీరు కాగలిగారన్నారు. పేదరికంలో ఉన్న అబ్దుల్ కలాం అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్త కావడానికి విద్య ద్వారానే సాధ్యమన్నారు.

అందుకే రాష్ట్రంలోని ప్రతి పేద విద్యార్థికి ఉన్నతమైన విద్యను అందించాలనే లక్ష్యంతో అమ్మ ఒడి ,విద్యా దీవెన ,విద్య వసతి, నేడు జగనన్న విద్యకానుకలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని హర్షధ్వానాల మధ్య పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు  జగనన్న విద్యా కానుకలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ జగనన్న అందిస్తున్న విద్యా పథకాలతో ప్రతి విద్యార్థి జీవితాలలో వెలుగులు నింపుతున్నాయని, ఆయనకు రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీంద్ర ,మండల విద్యాశాఖ అధికారి విజయ కుమారి ,ఎస్ ఎస్ ఏ అధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఫిబ్రవరి మాసాంతానికి లక్ష్యం అందుకోవాలి

Murali Krishna

నాగభైరవ నీట్ అకాడమీ సలహాదారుగా లలిత్ కుమార్

Satyam NEWS

కూలిన నాంప‌ల్లి స‌రాయి హెరిటేజ్ భ‌వ‌నం

Satyam NEWS

Leave a Comment