40.2 C
Hyderabad
April 29, 2024 15: 22 PM
Slider శ్రీకాకుళం

మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేయాలి

#human rights

సమాజంలో మానవ హక్కులకు భంగం వాటిల్లినప్పుడు మానవ హక్కుల సంఘం ముందుండి సమస్య పరిష్కారానికి కృషి చేయవలసిన ఆవశ్యకత ఉందని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకొని స్థానిక అర్ట్స్ కళాశాల సిల్వర్ జూబ్లీ ఆడిటోరియంలో హ్యూమన్ రైట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జెసి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ నేటి సమాజంలో మానవ హక్కులు ప్రతి ఒక్కరికీ అవసరమని అన్నారు. అయితే ఇప్పటికీ కొన్ని చోట్ల మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూనే ఉందని, దీనికి అణగారిన, వెనుకబడిన వర్గాల కుటుంబాల పట్ల అసమానతలేనని పేర్కొన్నారు.

ఆ ధోరణి ప్రతి ఒక్కరిలో పోవాలని, ఆ దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నప్పటికీ, మన దేశంలో 1949 సం.తరువాత భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తదుపరి అన్నివర్గాల వారికి సమన్యాయం చేకూరుతుందని గుర్తుచేసారు.

హ్యూమన్ రైట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాడాన దేవభూషణరావు మాట్లాడుతూ మానవ హక్కులకు ఉల్లంఘన జరగకుండా ఉండేందుకు అనేక చట్టాలున్నాయని, వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. మానవ హక్కులపై జిల్లా స్థాయిలో వివిధ పోటీలను నిర్వహించు కోవడం గర్వకారణమని, గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రధానం జిల్లా జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా చేయడం ఆనందంగా ఉందన్నారు.

జిల్లా అధ్యక్షులు నారా వెంకటేష్ మాట్లాడుతూ సమాజంలోని పౌరుల హక్కులకు ఎటువంటి ఉల్లంఘన జరగరాదని, ఆ విధమైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం ప్రతి పౌరునికి కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జిల్లా స్థాయి డిబేట్, ఆబ్జెక్టివ్ పోటీ పరీక్షలో విజేతలుగా నిలిచిన విద్యార్థిని విద్యార్థులకు జేసి చేతుల మీదుగా షీల్డ్, సర్టిఫికేట్ అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. పి.సురేఖ, సామాజిక సంఘ సేవకులు నటుకుల మోహన్, కేంద్ర మానవ హక్కుల సంఘం రాష్ట్ర సమన్వయకర్త జి.దుర్గాప్రసాద్, రాష్ట్ర అధ్యక్షులు బి.నర్సింగ రావు, రాష్ట్ర ఇంచార్జ్ యం.విష్ణు , రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షులు డి.లవకుమార్, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి యం.డి.గుల్జార్ ఖాన్, రాష్ట్ర కార్యదర్శి పైడి రమణమూర్తి, జిల్లా ప్రధాకార్యదర్శి క్రాంతి నాయక్ పి హేమ సుందర్, జోనల్ అధ్యక్షులు ఏ జగదీశ్, ఉపాధ్యక్షులు జామి సంతోష్, ప్రధాన కార్యదర్శి క్రాంతి నాయక్ ,పి.హేమసుందర్, జిల్లా ముఖ్య కార్యదర్శి సీపాన రమేష్ కుమార్, జిల్లా కార్యదర్శి జి.అనిల్ కుమార్, విద్యార్ధిని విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

బతుకమ్మ సంబురాలు: చీర అదిరె ఆడపడుచు మురిసే

Satyam NEWS

కరోనా వైరస్ నివారణకు హోమియో మందు

Satyam NEWS

బాదుడే బాదుడు: ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు

Satyam NEWS

Leave a Comment